MLC Kavitha: మళ్ళీ తీహార్ జైలుకు కవిత.. ఈ నెల 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Kavitha: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీకి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. మద్యం కుంభకోణం విచారణలో భాగంగా కవితకు రూస్ అవెన్యూ కోర్టు ఈ నెల 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అయితే.. కోర్టులో కవితను హాజరు పరిచిన సిబిఐ అధికారులు.. కవితని జ్యూడిషియల్ కస్టడీకి పంపాలని కోరింది. సాక్ష్యాలను కవిత ముందు పెట్టి విచారించామని, ఆమె విచారణకు సహకరించలేదని తెలిపింది. సీబీఐ వాదనలు విన్న కోర్టు.. కవితను 23 వరకు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. కాగా.. కవిత మాట్లాడుతూ.. ఇది బీజేపీ కస్టడీ.. సీబీఐ కస్టడీ కాదన్నారు. బయట బీజేపీ వాళ్ళు అడిగింది లోపల సీబీఐ అడుగుతుందన్నారు. రెండు నెలల నుంచి అడుగుతున్నారు. అడిగింది అడుగుతున్నారు కొత్తది ఏమీ లేదన్నారు.
Read also: Keerthi Suresh : ట్రేడిషనల్ లుక్ లో ఆకట్టుకుంటున్న కీర్తి సురేష్..
Also Read
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మూడు రోజుల కస్టడీ ముగియడంతో సీబీఐ అధికారులు ఆమెను ఇవాళ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. కవితను సీబీఐ న్యాయమూర్తి కావేరీ బవేజా ఎదుట హాజరుపరిచారు. ఇక, ఆదివారం విచారణలో భాగంగా ఆడిటర్ బుచ్చిబాబు ఫోన్ ద్వారా సేకరించిన చాటింగ్‌లు, మహబూబ్‌నగర్‌లో భూముల వ్యవహారం, ఆప్ నేతలకు ప్రాక్సీ ద్వారా డబ్బుల చెల్లింపులు, ఈ క్రమంలో బెదిరింపులపై కవితను ప్రశ్నించినట్లు తెలిసింది.
Read also: Devyani Khobrogade: కంబోడియా న్యూ ఇయర్ వేడుకలు.. ‘అప్సర’గా కనిపించిన భారత రాయబారి
సీబీఐ కార్యాలయంలో ఉన్న కవితను ఆమె భర్త అనిల్, సోదరుడు, మాజీ మంత్రి కేటీఆర్, న్యాయవాది మోహిత్ రావు కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలు, కోర్టులో అనుసరించాల్సిన వైఖరి తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవితను మార్చి 15న ఈడీ అరెస్టు చేసింది, అయితే ప్రత్యేక కోర్టు ఆమెకు మధ్యంతర బెయిల్ నిరాకరించింది. రెగ్యులర్ బెయిల్‌పై ఈ నెల 16న విచారణ జరగనుంది. ఇటీవల సీబీఐ కూడా కవితను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
Afghanistan Floods: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ వర్షాలు.. వరదల్లో 33 మంది మృతి
తాజావార్తలు
-
Afghanistan: ఆఫ్ఘాన్‌లో అమ్మాయిగా పుట్టడమే శాపమా?
-
Russia Sanctions Bill: రష్యా నుంచి చమురు కొంటే భారత్‌పై 100% టారిఫ్‌లు? అమెరికా హౌస్‌లో కీలక బిల్లు పాస్
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!