MLC Kavitha: కవితకు నిరాశ.. బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Kavitha: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో సారి నిరాశ ఎదురైంది. ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి సీబీఐ అరెస్టుపై కవిత వేసిన బెయిల్ పిటిషన్‌పై తీర్పును రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును మే 2కు రిజర్వ్ చేసింది. ఈడీ అరెస్టులో ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ కొనసాగుతోంది. సీబీఐ కేసులో తీర్పును రిజర్వ్ చేసిన న్యాయస్థానం.. ఈడీ కేసులో ఎలాంటి తీర్పు ఇస్తుందోనని ఉత్కంఠ నెలకొంది. కాగా, ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితను ఈడీ మార్చి 15న అదుపులోకి తీసుకోగా, సీబీఐ ఏప్రిల్ 11న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆమె రెండు బెయిల్ పిటషన్లు వేశారు. ప్రస్తుతం ఆమె 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైలులో ఉన్నారు.
Read Also: CM Revanth Reddy: ఆదిలాబాద్‌కు సీఎం రేవంత్ రెడ్డి వరాలు..
Also Read
- Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
- Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
- Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
- CM Vijay: సీఎం విజయ్ ఖాళీ చేసిన తిరుచ్చి స్థానానికి బైపోల్ ఎందుకు జరగలేదు.. కారణమిదేనా?
సీబీఐ లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్‌పై ఆమె తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. మహిళగా కవిత బెయిల్‌కు అర్హురాలు. అరెస్ట్ నుంచి విచారణ వరకు ఎటువంటి మెటీరియల్ లేదు. ఆధారాలు లేకుండానే అరెస్ట్ చేశారు. ఈడీ కస్టడీలో ఉన్నా.. సీబీఐ ఎందుకు అరెస్ట్ చేసింది. అరెస్ట్ చెయ్యాల్సిన అవసరం లేదు. పార్టీకి స్టార్ క్యాంపైనర్. ప్రతిపక్షంలో ఉన్నాం.. రూలింగ్ లో ఉన్నపుడే, ఏం చెయ్యలేక పోయాం. చిదంబరం జడ్జిమెంట్ కవిత విషయంలో సరిపోతుంది. ఏడేళ్ల లోపల పడే శిక్ష ఆధారాలకు అరెస్ట్ అవసరం లేదు. అరెస్ట్‌కు సరైన కారణాలు లేవు.” కవిత తరపున వాదనలు వినిపించారు. అనంతరం సీబీఐ తరపున వాదనలు జరిగాయి. “కవితకు బెయిల్ ఇవ్వొద్దు. కవిత ప్రభావితం చేయగలుగుతారు. కవిత లిక్కర్ కేసులో కీలక వ్యక్తిగా ఉన్నారు” అని సీబీఐ వాదనలు వినిపించింది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును మే 2కు రిజర్వ్ చేసింది.
తాజావార్తలు
-
Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
-
Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
-
Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
-
Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
-
Anandhi: నిత్యామీనన్‌తో సహా స్టార్ హీరోయిన్లు వద్దనుకున్న కథ.. ఆనంది తలరాత మార్చబోతోందా?
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు