MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ ఇచ్చింది రౌస్ అవెన్యూ కోర్టు. కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. మే 7 వరకు జ్యుడీషియల్ కస్టడీకి ఇచ్చింది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం. కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపుపై సీబీఐ, ఈడీ అప్లికేషన్ దాఖలు చేసింది. దీంతో వాదనలు విన్న రౌస్ అవెన్యూ కోర్డు 14 రోజులపాటు కస్టడీ పొడిగించాలని కోరింది. కొత్త అంశాలను ఏమి ఈడీ జత చెయ్యలేదని, స్టడీ అవసరం లేదంటూ కవిత తరపు న్యాయవాది తెలిపారు. సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని, కేసు విచారణ పురోగతిపై ప్రభావం ఉంటుంది కాబట్టి కస్టడీ పొడిగించాలని ఈడీ న్యాయవాది కోరారు. కేసు దర్యాప్తు పురోగతిని కోర్టుకు ఈడీ అందజేసింది. 60 రోజుల్లో కవిత అరెస్ట్‌పై చార్జిషీట్ సమర్పిస్తామని ఈడీ కోర్టుకు తెలిపింది.
Read also: Dulam Nageswara Rao: కైకలూరు నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేయటం ఖాయం
సాక్ష్యాలను తారుమారు చేస్తారని అరెస్ట్ చేసిన రోజునుంచి ఆరోపిస్తుంది ఈడీ. కొత్తగా ఏమీ చెప్పడం లేదంటూ కవిత తరపు న్యాయవాది రాణా తెలిపారు. అయితే ఇరు వాదనలు విన్న రౌస్ అవెన్యూ కోర్టు 14 రోజులు పొడిగిస్తూ మే 7 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. కాగా.. మార్చి 15న కవితను హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మద్యం కేసులో ఇప్పటికే పలువురు నిందితులను అరెస్టు చేసి వాంగ్మూలాలు ఇచ్చారు. నిందితుల వాంగ్మూలాలపై ఈడీ అధికారులు కవిత నుంచి వివరణ తీసుకున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కస్టడీని మరో రెండు రోజులు పొడిగించాలని ఈడీ కోర్టును కోరే అవకాశం ఉంది. ఇప్పటికే కవిత ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు వాదనలను రౌస్ అవెన్యూ కోర్టు నేడు విచారించి కవితకు 14 రోజులు రిమాండ్ పొడిగిస్తూ మే 7వ తేదీవరకు జ్యూడీషియల్ కస్టడీ విధించింది.
Jagga Reddy: ఇందిరమ్మకు ఉన్న చరిత్ర.. మోడీ, అమిత్ షాలకు ఉందా?