ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ ఐపీఎల్ సీజన్లో ఇప్పటివరకూ చాలా చెత్త ప్రదర్శన కనబరిచాడు. ఒక్క అర్థశతకం మినహాయిస్తే, అంతకుమించి గొప్పగా రాణించిన...
ఐపీఎల్ లో అత్యధిక సార్లు ట్రోఫీలు నెగ్గిన జట్లుగా ఉన్న ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ల మధ్య ఇవాళ జరిగే మ్యాచ్ ను అభిమానులు ‘ఎల్ క్లాసికో’గా అభివర్ణిస్తారు. ఈ సీజన్ లో ఇదివరకే ఒకసారి జరిగిన ఎల్ క్లాసికోలో చెన్నైదే పైచేయి అయింది. వాంఖెడేలో చెన్నై.. ముంబైని మట్టికరిపించింది. ఇక నేడు ముంబై బదులు తీర్చుకునే సమయం ఆసన్నమైంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో భాగంగా ఇవాళ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ముంబయి ఇండియన్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తలపడనుంది. మధ్యాహ్నం 3.30గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ తీవ్ర ఉత్కంఠంగా జరిగే అవకాశం ఉంది.
డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే భారత టీమ్ మిడిలార్డర్ చాలా బలహీనంగా మారింది. రిషభ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ ఇప్పటికే గాయాలతో జట్టుకు దూరమయ్యారు. తాజాగా కేఎల్ రాహుల్ కూడా ఈ మ్యాచ్ ఆడటం లేదని ప్రకటించాడు. దీంతో అతను కూడా తొడకు శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చిందని వెల్లడించాడు. ఈ క్రమంలో సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ వృద్ధిమాన్ సాహాను మళ్లీ జట్టులోకి తీసుకోవాలని బీసీసీఐ పెద్దలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
పంజాబ్ కాంగ్స్ తో జరిగిన మ్యాచ్ లోనూ రోహిత్ శర్మ ( 0 ) డక్ అవుట్ అయ్యాడు. ఇన్సింగ్స్ మూడో బంతికే క్యాచ్ ఔట్ గా వెనుదిరిగాడు. దాంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికసార్లు డకౌట్ అయిన బ్యాటర్ గా చెత్త రికార్డును నమోదు చేశాడు.