చాలా రోజులుగా క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ రానే వచ్చింది. ఇవాళ (మంగళవారం) ఐసీసీ ప్రపంచకప్ షెడ్యూల్, వేదికలు, మ్యాచ్ వివరాలు, టైమింగ్స్‌ను రిలీజ్ చేసింది. పుష్కరకాలం తర్వాత భారత్ వరల్డ్‌కప్‌కు ఆతిథ్యం ఇవ్వనుండడంతో అంచనాలు తారాస్థాయికి చేరాయి. 2011లో మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో చేసిన మ్యాజిక్‌ను ఈసారి రోహిత్ సేన రిపీట్ చేయాలని టీమిండియా క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.
Read Also: AP Rain Alert : మరో 3 రోజులు భారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు..
స్వదేశంలో ప్రపంచకప్ జరుగుతుండడంతో టీమిండియా హాట్ ఫెవరెట్‌గా బరిలోకి దిగుతున్నప్పటికి.. ఇటీవలీ కాలంలో మన టీమ్ ఇస్తున్న ప్రదర్శన చూస్తే కాస్త కలవర పెడుతుంది. కానీ భారత్ లో మనల్ని ఓడించాలంటే ఏ జట్టుకైనా కొద్దిగా కష్టమే. కాగా ప్రపంచకప్ షెడ్యూల్ రిలీజ్ చేయడంపై టీమిండియా సారథి రోహిత్ శర్మ రియాక్ట్ అయ్యారు.
Read Also: Maldives Tourist Destinations: కలల గమ్యస్థానం మాల్దీవులు.. అక్కడ చూడాల్సిన అందాలు ఇవే..
టి20 ఫార్మాట్ వచ్చిన తర్వాత వన్డే క్రికెట్‌లో కూడా వేగం పెరిగింది. అందుకే ఈ ప్రపంచకప్ లో కూడా తీవ్రమైన పోటీ పెరిగిందని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. అయితే, వరల్డ్‌కప్ కొట్డడం అంత ఈజీ కాదని.. శక్తి మేరకు కష్టపడతామని రోహిత్ చెప్పుకొచ్చాడు. రౌండ్ రాబిన్ లీగ్‌లో మ్యాచ్‌లు ఆడనుండడంతో అన్ని జట్లపై ఒత్తడి ఉంటుందని పేర్కొన్నాడు. స్వదేశంలో వరల్డ్ కప్ జరుగుతుండడంతో మాపై అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో బాగా తెలుసు అని రోహిత్ చెప్పాడు.
Read Also: ICC World Cup 2023: వరల్డ్ కప్ షెడ్యూల్ రిలీజ్ తర్వాత జైషాపై ట్రోలింగ్
2011ను రిపీట్ చేయడానికి ప్రయత్నిస్తాం.. అందుకోసం పాజిటివ్ మైండ్‌సెట్‌తో ఆడాలని అనుకుంటున్నాం అని రోహిత్ శర్మ అన్నాడు. ఇప్పటి నుంచి వరల్డ్ కప్‌కు ప్రిపరేషన్ మొదలుపెట్టాలి.. అక్టోబర్-నవంబర్‌లో జరిగే వరల్డ్‌కప్‌లో మా బెస్ట్ ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తాం అన్నారు. బెస్ట్ ఇవ్వాలి.. అప్పుడే ప్రపంచకప్ గెలుస్తాం.. ముంబైలో మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.
🗣️🗣️ We look forward to preparing well and being at our best this October-November #TeamIndia Captain @ImRo45 is all in readiness ahead of the #CWC23 👌👌 pic.twitter.com/ZlV8oNGJ04
— BCCI (@BCCI) June 27, 2023