తెలుగు సినీ ప్రేక్షకులకు నటి శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూ నే ఉంటుంది.తరచూ వివాదాలతో వివాదాస్పద నటి గా కూడా పేరు తెచ్చుకుంది శ్రీ రెడ్డి. అంతేకాకుండా నిత్యం ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తూ వారిపై విమర్శలను గుప్పిస్తూ వార్తల్లో నిలుస్తూ నే ఉంటుంది. ఇక ఎప్పుడైనా అవతలి వారు ఆమె గురించి ఏదైనా కొద్దిగా మాట్లాడారు అంటే చాలు వారి అంతు చూసే వరకు అయితే ఆమె విడిచిపెట్టదు.
కెప్టెన్ రోహిత్ శర్మను టార్గె్ట్ చేస్తూ విమర్శలు కూడా చేసింది. తనదైన శైలి లో కామెంట్స్ చేసింది రోహిత్ శర్మ కెప్టెన్సీ పై శ్రీరెడ్డి విమర్శలు చేయడం అందరిని ఆశ్చర్య పరిచింది.. విరాట్ కోహ్లీ పై ప్రశంసలు కురిపిస్తూ రోహిత్ ని తక్కువ చేసి అయితే మాట్లాడింది.. దీంతో రోహిత్ అభిమానులు శ్రీ రెడ్డి పై తెగ మండిపడుతున్నారు.. తొక్కలో కెప్టెన్సీ. ఇదేమన్నా ఐపీఎల్ అనుకున్నవావా బాబు. నీ కెప్టెన్సీ చూసి కోహ్లి కూడా నవ్వుకుంటున్నాడు. ఇదేంట్రా బాబూ అని రోజంత ఫీల్డింగ్ చేస్తూ బౌలింగ్ చెయ్యాలంటే ప్లేయర్స్ లో జోష్ కావాలి. అది కోహ్లి ఒక్కడే చెయ్యగలడని ప్లేయర్స్ను అతడు ఇన్స్పైర్ చేస్తాడని ప్రపంచంలోనే అతడు ఉత్తమ టెస్ట్ కెప్టెన్ అని శ్రీరెడ్డి తన కామెంట్స్ చేసింది.అందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడంతో రోహిత్ శర్మ అభిమానులు శ్రీరెడ్డి పై తీవ్ర స్థాయిలో అయితే మండిపడుతున్నారు. నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఆమెని బూతులు కూడా తిడుతున్నారు.ఇప్పటి వరకు సినిమా వారినే ఆడిపోసుకున్న శ్రీ రెడ్డి ఈ సారి క్రికెటర్స్ మీద పడింది. సినిమా వారిని తిట్టి బోర్ కొట్టిందేమో మరీ. కానీ రోహిత్ ఫ్యాన్స్ తో శ్రీ రెడ్డి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మరీ.