ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీస్, ఫైనల్స్‌లో మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌పై కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫైర్ అయిన విషయం తెలిసిందే. బాల్ వేసిన అనంతరం స్టంప్స్ వెనకే ఉండడం, ఫీల్డర్ త్రో విసిరినా బంతిని పట్టుకోకపోవడంతో ఆగ్రహానికి గురయ్యాడు. ఫైనల్ మ్యాచ్‌లో 41వ ఓవర్లో రవీంద్ర జడేజా మెరుపు వేగంతో బంతిని వేయగా.. వికెట్లకు దగ్గర నుంచి వెళ్తున్న బంతిని కుల్దీప్ పట్టుకోవడానికి కూడా ప్రయత్నించలేదు. సెమీస్‌లో స్టీవ్ స్మిత్…
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్‌ను ఐసీసీ (ICC) ప్రకటించింది. ఇందులో టీమిండియా నుంచి ఆరుగురికి చోటు దక్కింది. అయితే.. అందులో కెప్టెన్ రోహిత్ శర్మ లేకపోవడం ఆశ్చర్యకరం.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని టీమిండియా కైవసం చేసుకుంది. టీమిండియా తాజా గెలుపుతో మరో ట్రోఫీని ఖాతాలో వేసుకుంది. విజయనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. శ్రేయాస్ అయ్యర్‌ను సైలెంట్ హీరో అని వ్యాఖ్యానించాడు. 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజయంలో టీమిండియాకు సైలెంట్ హీరోగా నిలిచిన ఆటగాడిగా రోహిత్ శర్మ శ్రేయాస్ అయ్యర్‌ను సెలక్ట్ చేశాడు. అతని గురించి ఎక్కువ మాట్లాడ లేకపోయినా.. అతను తన పనిని పూర్తి అంకితభావంతో చేశాడని రోహిత్ శర్మ తెలిపాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు న్యూజిలాండ్‌ను ఓడించి టైటిల్ కైవస చేసుకుంది. దీంతో టీమిండియా రికార్డు స్థాయిలో మూడో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను కైవసం చేసుకుంది. టీమిండియా విజయం సాధించిన తర్వాత, స్టేడియం లోపల, వెలుపల సంబరాలు అంబరాన్నంటాయి. క్రికెట్ ఫ్యాన్స్ ర్యాలీలు తీస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు. క్రికెట్ దిగ్గజాలు కూడా సెలబ్రేషన్స్ లో భాగమయ్యారు. వీరిలో భారత క్రికెట్ దిగ్గజం, టీం ఇండియా మాజీ లెజెండరీ బ్యాట్స్‌మన్ సునీల్ గవాస్కర్ వీడియో…
ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ తర్వాత టీమిండియా కీలక ఆటగాళ్లు రిటైర్ మెంట్ ప్రకటించబోతున్నారంటూ చర్చలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వన్డేలకు వీడ్కోలు పలుకుతాడని ఊహాగానాలు వెల్లువెత్తాయి. గత సంవత్సరం ప్రపంచ కప్ గెలిచిన తర్వాత అతను T20 అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినట్లుగానే ఇప్పుడు ఛాంపియన్ ట్రోఫీ అనంతరం వన్డేలకు రిటైర్ మెంట్ పలుకుతాడని అంతా భావించారు. అయితే ఈ పుకార్లకు రోహిత్ స్వయంగా ఫుల్ స్టాప్ పెట్టాడు. రిటైర్మెంట్ ఊహాగానాలపై…
ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలో ఓటమన్నదే లేకుండా టీమిండియా టైటిల్ కైవసం చేసుకుంది. మూడోసారి ఐసీసీ ఛాంపియన్ ట్రోఫిని గెలుచుకుని సరికొత్త హిస్టరీని క్రియేట్ చేసింది. దుబాయ్‌లో జరిగిన 9వ సీజన్ ఫైనల్లో న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించి భారత్ మూడోసారి టైటిల్‌ను గెలుచుకుంది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఫైనల్లో విజయం సాధించి చరిత్ర సృష్టించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 83 బంతుల్లో 76 పరుగులు చేసి భారత్ విజయానికి హీరో అయ్యాడు. Also Read:NKR…
దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా భారత్, న్యూజీలాండ్ మధ్య ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో భాగంగా టాస్ గెలిచిన కివీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. భారత బౌలర్ల ధాటికి నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్ బ్యాటింగ్ లో సత్తాచాటుతోంది. అయితే ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యాడు.…
ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన నిర్ణయం తీసుకోనున్నారు. వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించే యోచనలో రోహిత్ శర్మ..? ఉన్నట్లు సమాచారం. తన భవిష్యత్‌పై సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్‌తో చర్చించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
Rohit Sharma To Surprise Kiwis: దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఆడేందుకు భారత్ రెడీ అయింది. మరి తుది జట్టు ఎలా ఉంటుందనే దానిపై ఇప్పటికే పలువురు తమ అభిప్రాయాలను తెలియజేశారు.
Ravichandran Ashwin: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కోసం క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. భారత్ - న్యూజిలాండ్ మధ్య దుబాయ్ వేదికగా ఇవాళ (మార్చ్ 9) మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.