హిట్మ్యాన్…జూలు విదిల్చాడు. ఇంగ్లాండ్తో జరుగుతోన్న నాల్గో టెస్టులో…సెంచరీతో చెలరేగాడు. అతిథ్య జట్టుపై పూర్తి ఆధిపత్యం చెలాయించాడు రోహిత్ శర్మ. టెస్టుల్లో ఓవరాల్గా…8వ సెంచరీ నమోదు చేయడంతో…భార్య రితిక సంబరాల్లో మునిగిపోయారు. టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ…నాల్గో టెస్టులో చెలరేగి ఆడాడు. జట్టు భారీ స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. ఏళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన హిట్మ్యాన్…సుదీర్ఘ ఫార్మాట్లో విదేశీ గడ్డపై తొలి శతకం సాధించాడు. సిక్సర్తో వంద పరుగులు చేసిన రోహిత్ శర్మ…టెస్టుల్లో ఓవరాల్గా 8వ…