భారత క్రికెట్ అభిమానులు ఎప్పటి నుండో ఊహిస్తున్న విషయం వన్డే జట్టుకు కెప్టెన్ గా రోహిత్ శర్మనే నియమిస్తారు అనేది. అయితే ఇప్పుడు అది నిజం అయ్యింది. ఈ ఏడాది యూఏఈలో జరిగిన టీ20 ప్రపంచ కప్ తర్వాత ఆ పొట్టి ఫార్మటు నుండి కెప్టెన్ గా విరాట్ కోహ్లీ తప్పుకున్న విషయం తెలిసిందే. దాంతో ఆ బాధ్యతలు రోహిత్ శర్మ చేతిలో ఉంచింది బీసీసీఐ. అప్పటి నుండి వన్డే జట్టుకు కూడా అతడినే కెప్టెన్ గా నియమిస్తారు అనే వార్తలు ప్రారంభమయ్యాయి. అయితే ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ ఇప్పుడు బీసీసీఐ అధికారిక ప్రకటన చేసింది.
తాజాగా బీసీసీఐ ట్విట్టర్ లో… భారత వన్డే మరియు టీ20 జట్టుకు కెప్టెన్ గా రోహిత్ శర్మను నియమిస్తూ ఆల్-ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది” అని పోస్ట్ చేసింది. దాంతో ఇక నుండి విరాట్ కోహ్లీ కేవలం టెస్ట్ జట్టుకు మాత్రమే కెప్టెన్ గా ఉండనున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ లో ఓ ఆటగాడిగా కొనసాగుతాడు. అలాగే ఐసీసీ ట్రోఫీ గెలవడానికి ఇక కోహ్లీ ముందు కేవలం టెస్ట్ ఛాంపియన్ షిప్ మాత్రమే ఉంది.