టీమిండియా అభిమానులకు భారీ షాక్. ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించాడు. ఇప్పటికే రోహిత్ అంతర్జాతీయ టీ20కి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా టెస్టులకు గుడ్‌బై చెప్పాడు. టీ20, టెస్టు ఫార్మాట్లకు దూరమైనా.. వన్డేల్లో హిట్‌మ్యాన్ కొనసాగనున్నాడు. 2027 వన్డే ప్రపంచకప్ వరకు రోహిత్ ఆడే అవకాశాలు ఉన్నాయి. వన్డే ప్రపంచకప్ గెలవడం తన కల అని ఎన్నోసార్లు చెప్పిన విషయం తెలిసిందే.…
ఇప్పటికే టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు చెప్పిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 అనంతరం వన్డేలకూ గుడ్‌బై చెబుతాడని అంతా భావించారు. అయితే తాను రిటైర్‌మెంట్ తీసుకోవడం లేదంటూ స్పష్టం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో మరో రెండేళ్ల పాటు హిట్‌మ్యాన్ కొనసాగే అవకాశం ఉంది. వన్డే ప్రపంచకప్ 2027, ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్‌లోనూ ఆడతాడని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. వన్డే ప్రపంచకప్ తన కల అని రోహిత్ చాలాసార్లు చెప్పిన విషయం…
Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన భవిష్యత్తు, ఫామ్‌పై వస్తున్న విమర్శలకు 2025 ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy)లో గట్టి సమాధానం ఇచ్చాడు. తన రిటైర్మెంట్ గురించి వస్తున్న ఊహాగానాలకు స్వయంగా తెరదించుతూ, తాను ఇప్పట్లో వన్డే క్రికెట్‌కు వీడ్కోలు చెప్పే ప్రసక్తే లేదని స్పష్టంగా ప్రకటించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం రోహిత్ వన్డేలకు గుడ్‌బై చెప్పనున్నాడని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగినా.. మ్యాచ్ విజేతగా నిలిచిన అనంతరం జరిగిన…
Cricketers Retirement in 2024: 2024 సంవత్సరం ముగింపుకు వస్తోంది. భారత క్రికెట్‌లో ఈ ఏడాది ప్రముఖ ఆటగాళ్ల రిటైర్మెంట్‌తో ఎంతో కీలక మార్పు చోటుచేసుకుంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ వంటి దిగ్గజ ఆటగాళ్లు తమ ఆట జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ ఏడాది మొత్తం 12 మంది భారత క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటించారు. 2024 టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత, కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర…
న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టులూ ఓడిపోయి భారత్ తీవ్ర పరాభవంను మూటగట్టుకుంది. భారత టెస్టు క్రికెట్ చరిత్రలో సొంతగడ్డపై మూడు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ తొలిసారి వైట్‌వాష్‌కు గురైంది. రెండు టెస్టుల్లో ఓటమితో పాఠాలు నేర్వని రోహిత్ సేన.. మూడో టెస్టులో సైతం ఓడడంపై విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సహా కోచ్ గౌతమ్ గంభీర్‌లు ఓటమికి బాధ్యత వహించాలని మాజీ క్రికెటర్లు అంటున్నారు.…
Rohit Sharma About Take U-Turns on Retirements: ఇటీవలి కాలంలో అంతర్జాతీయ క్రికెట్‌లో రిటైర్మెంట్ ఇవ్వడం.. ఆపై యూటర్న్ తీసుకోవడం సాధారణమైపోయింది. వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో, ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్, పాకిస్తాన్ సీనియర్ పేసర్ మహ్మద్ అమీర్‌లు రిటైర్మెంట్ ఇచ్చి.. మళ్లీ జాతీయ జట్టుకు ఆడిన విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ కూడా మరలా జట్టు తరఫున ఆడేందుకు ప్రయత్నాలు చేశాడు. మరికొందరు ప్లేయర్స్ కూడా రిటైర్మెంట్‌పై…
Rohit Sharma React on Retirement: భారత జట్టుకు టీ20 ప్రపంచకప్ 2024 ట్రోఫీ అందించిన రోహిత్ శర్మ.. పొట్టి ఫార్మాట్ నుంచి రిటైర్‌మెంట్ తీసుకున్న విషయం తెలిసిందే. ఫైనల్ మ్యాచ్ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో హిట్‌మ్యాన్ ఈ విషయాన్ని వెల్లడించాడు. టెస్ట్, వన్డే ఫార్మాట్‌లలో మాత్రం ఆడుతానని రోహిత్ స్పష్టం చేశాడు. అయితే టెస్ట్, వన్డే ఫార్మాట్ల నుంచి కూడా రోహిత్ త్వరలోనే తప్పుకుంటాడని సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. కెరీర్‌కు…
Rohit Sharma Mother Purnima Sharma Speech in Wankhede: టీమిండియా స్టార్ ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ టీ20లకు రిటైర్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. భారత జట్టు టీ20 ప్రపంచకప్ 2024 విజేతగా నిలిచిన అనంతరం హిట్‌మ్యాన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో భారత్ తరఫున రోహిత్ చివరి టీ20 మ్యాచ్ ఆడాడు. టెస్ట్, వన్డేలలో మాత్రం హిట్‌మ్యాన్ కొనసాగనున్నాడు. అయితే టీ20 రిటైర్మెంట్ గురించి రోహిత్ ముందుగా తన తల్లికి…
Rohit Sharma Announce Retirement From T20 Internationals: టీమిండియా కెప్టెన్, స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. హిట్‌మ్యాన్ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ మ్యాచ్ అనంతరం రోహిత్ ఈ ప్రకటన చేశాడు. వీడ్కోలు పలకడానికి ఇదే సరైన సమయమని రోహిత్ పేర్కొన్నాడు. శనివారం ఉత్కంఠగా సాగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి.. విశ్వవిజేతగా నిలిచింది. దాంతో 11…