ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌లో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ రాణించిన విషయం తెలిసిందే. మొదటి వన్డేలో 8 పరుగులే చేసిన రోహిత్.. రెండో వన్డేలో 73 రన్స్, మూడో వన్డేలో 121 పరుగులు చేశాడు. చివరి వన్డేలో భారత్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన హిట్‌మ్యాన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్’ అందుకున్నాడు. సిరీస్‌లో హయ్యెస్ట్ రన్ స్కోరర్‌గా నిలిచి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ కూడా సొంతం చేసుకున్నాడు. వన్డే సిరీస్ ముగియడంతో…
సిడ్నీ వేదికగా శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆసీస్ నిర్దేశించిన 237 పరుగుల లక్షాన్ని భారత్ 38.2 ఓవర్లలోఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. టీమిండియా విజయంలో సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ (121), విరాట్ కోహ్లీ (74)లు కీలక పాత్ర పోషించారు. మ్యాచ్ అనంతరం కామెంటేటర్లు ఆడమ్ గిల్‌క్రిస్ట్, రవిశాస్త్రిలతో రో-కోలు మాట్లాడుతూ ఆస్ట్రేలియన్ క్రికెట్‌తో తమకున్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగం చెందారు. మరోసారి ఆస్ట్రేలియా…
ఈ రోజు మ్యాచ్ చాలా బాగనిపించిందని, తన బ్యాటింగ్‌ను ఎంతో ఎంజాయ్ చేశాను అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. తాను చేయాల్సిన పరుగులను భాగాలుగా ఎంచుకొని రాబట్టానని, వన్డేల్లో పరిస్థితులకు తగ్గట్లుగా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుందన్నాడు. ప్రత్యర్థి బౌలర్లు తన శరీరాన్ని లక్ష్యంగా చేసుకొని బౌలింగ్ చేసినప్పుడు.. తన ప్రణాళికలు అమలు పరిచానని హిట్‌మ్యాన్ తెలిపాడు. శుభ్‌మన్ క్లాసీ ప్లేయర్ అని, పరిస్థితులకు అనుగుణంగా ఆడుతాడని రోహిత్ ప్రశంసించాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా…
కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో విజయం సాధించేందుకు తాము చాలా రిస్క్ తీసుకున్నామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. బ్యాటర్లు రిస్క్ తీసుకుని దూకుడుగా ఆడే క్రమంలో 100 పరుగులకు ఆలౌటైన ఫర్వాలేదనే మైండ్‌సెట్‌తో ఉన్నామని తెలిపాడు. పిచ్ పెద్దగా సహకరించకున్నా.. టీమిండియా బౌలర్లు గొప్పగా రాణించారని ప్రశంసించాడు. రెండో టెస్టు విజయం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని హిట్‌మ్యాన్ పేర్కొన్నాడు. డ్రా అవుతుందనుకున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌లో అదరగొట్టిన భారత్..…
భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. అశ్విన్ గురించి తాను ప్రత్యేకంగా చెప్పేది ఏమీ లేదన్నాడు. వికెట్స్ అవసరమైన ప్రతిసారీ అతడివైపే చూస్తాం అని చెప్పాడు. బంతి లేదా బ్యాట్‌తో జట్టును ఆదుకునేందుకు ఎల్లప్పుడూ యాష్ సిద్ధంగా ఉంటాడని రోహిత్ తెలిపాడు. టీఎన్‌పీఎల్‌లో అశ్విన్ బ్యాటింగ్ చేయడం తాము చాలాసార్లు గమనించాం అని హిట్‌మ్యాన్ పేర్కొన్నాడు. చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో యాష్ సెంచరీ…
Rohit Sharma Heap Praise on Jeffrey Vandersay: బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే శ్రీలంకతో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో ఓడిపోయాం అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. శ్రీలంక స్పిన్నర్ జెఫ్రె వండర్సే (6/33) అసాధారణ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడని, అతడే తమ పతనాన్ని శాసించాడని పేర్కొన్నాడు. మిడిలార్డర్ వైఫల్యంపై చర్చించాల్సిన అవసరం ఉందని రోహిత్ చెపుకొచ్చాడు. ఆదివారం కొలంబో వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో 32 పరుగుల తేడాతో భారత్ పరాజయం పాలైంది. 241…
Rohit Sharma on T20 World Cup 2024 Final Match: బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించిన భారత్.. 11 ఏళ్ల తర్వాత ఐసీసీ టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే. అయితే ఫైనల్‌లో ఓ దశలో భారత్ పూర్తిగా వెనకపడిపోయింది. 15 ఓవర్ల తర్వాత దక్షిణాఫ్రికా గెలుపు సమీకరణం 30 బంతుల్లో 30 పరుగులు. చేతిలో 6 వికెట్లున్న దక్షిణాఫ్రికా ఓటమి పాలవుతుందని ఎవరూ అనుకోలేదు. భారత…
Rohit Sharma Hails Shivam Dube and Suryakumar Yadav: కఠినమైన న్యూయార్క్ పిచ్‌పై పరుగులు చేయడం చాలా కష్టం అని.. సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబేల అద్భుత బ్యాటింగ్‌తోనే తాము గెలిచాం అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. అర్ష్‌దీప్ సింగ్ అసాధారణ ప్రదర్శన చేశాడని ప్రశంసలు కురిపించాడు. అమెరికా జట్టులోని అందరూ బాగా ఆడుతున్నారన్నాడు. సూపర్ 8కు అర్హత సాధించడం సంతోషంగా ఉందని రోహిత్ చెప్పుకొచ్చాడు. టీ20 ప్రపంచకప్ 2024 గ్రూప్-ఏలో భాగంగా…
Rohit Sharma Happy For New York Fans: భారత్ ఎక్కడ ఆడినా అభిమానులు తమని నిరాశపరచరని, న్యూయార్క్ ప్రేక్షకుల మద్దతు అద్భుతం అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ఈరోజు ఫాన్స్ అందరూ చిరునవ్వుతో ఇంటికి వెళతారని తాను ఖచ్చితంగా అనుకుంటున్నానన్నాడు. ఇది ప్రారంభం మాత్రమే అని, టీ20 ప్రపంచకప్ 2024లో ఇంకా చాలా దూరం ప్రయాణించాలని హిట్‌మ్యాన్ చెప్పాడు. మెగా టోర్నీలో భాగంగా ఆదివారం న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో…
Rohit Sharma React on Ben Duckett Bazball Comments: ఇంగ్లండ్ బ్యాటర్ బెన్ డక్కెట్ చేసిన వ్యాఖ్యలపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సెటైర్లు వేశాడు. బహుశా టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఆటను బెన్ డక్కెట్ చూసుండడని సెటైర్ వేశాడు. అసలు ఈ బాజ్‌బాల్ అంటే ఏంటో తనకు ఇప్పటికీ అర్ధం కావడంలేదన్నాడు. తాను స్కూల్లో పెద్దగా చదవుకోపోయినా.. క్రికెట్లో మాత్రం ప్రత్యర్థుల ఆటతీరును బాగా చదువుతానని రోహిత్ తెలిపాడు. ఇంగ్లండ్ బజ్‌బాల్…