Highest runs in T20 World Cup: T20 ప్రపంచ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన తోపు ప్లేయర్స్ వీరే.. టాప్-5లో ఇద్దరు మనోళ్లే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Highest runs in T20 World Cup: ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ 2026 ప్రారంభానికి మరో వరం రోజులే ఉంది. ఈ సారి భారతదేశం, శ్రీలంక ఆతిథ్యంగా నిర్వహించే ఈ టోర్నమెంట్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు. 2007 నుండి T20 వరల్డ్ కప్ మొదలైందన్న సంగతి తెలిసిందే. కానీ కేవలం కొద్దిమందే ఈ ఫార్మాట్ లో సత్తా చూపారు. మరి ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు సాధించిన టాప్ 5 బ్యాట్స్‌మెన్స్ ఎవరో చూద్దామా..
5. డేవిడ్ వార్నర్:
డేవిడ్ వార్నర్ T20 క్రికెట్‌లో ధనాధన్ ఇన్నింగ్స్ ల స్టైల్‌తో బాగా గుర్తింపు పొందారు. ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్‌లో వార్నర్ ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు.2021 T20 వరల్డ్ కప్ టైటిల్‌లో అతని పాత్ర కీలకంగా ఉంది. ఆయన ఇప్పటి వరకు 41 ఇన్నింగ్స్ లలో 984 పరుగులు చేశాడు.
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Smriti Mandhana: స్మృతి మంధాన భావోద్వేగ పోస్టు.. ఆమె సేవలు మరువలేనివంటూ..
- India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
4. జోస్ బట్లర్:
జోస్ బట్లర్ ఆధునిక T20 బ్యాటింగ్‌లో అత్యుత్తమంగా పరిగణించబడతాడు. ఆగ్రెసివ్ ప్లేయింగ్ అతని శైలి. ఏ ఇంగ్లాండ్ బ్యాటర్ బట్లర్ 34 ఇన్నింగ్స్ లలో 1013 పరుగులు చేశాడు. ఓపెనర్‌గా ఆడినా లేదా ఫినిషర్‌గా ఆడినా, నిమిషాలలో మ్యాచ్ లను మలుపు తిప్పగలడు. 2022 టీ20 ప్రపంచ కప్ విజయంలో అతను కీలక పాత్ర పోషించాడు.
3. మాహెల జయవర్ధనే:
శ్రీలంక దిగ్గజ ఆటగాళ్లలో ఒకరైన మాహెల జయవర్ధనే ఈ లిస్ట్ లో స్థానం సంపాదించుకున్నారు. పవర్ ఫోకస్‌డ్ T20 బ్యాటింగ్‌కు ముందే జయవర్ధనే స్మార్ట్ క్రికెట్ ద్వారా ఫార్మాట్‌లో తన ముద్ర వేసాడు. శ్రీలంక T20 వరల్డ్ కప్ ప్రారంభ కాలంలో కీలక ఆటగాడిగా నిలిచాడు. ఈయన 31 ఇన్నింగ్స్ లలో 1016 పరుగులు చేశాడు. పదేళ్ల తర్వాత కూడా టాప్ 5లో ఉండటం అతని బ్యాటింగ్ పవర్ ఏంటో అర్థమవుతుంది.
2. రోహిత్ శర్మ:
స్టైల్, పవర్ కలిస్తే రోహిత్ శర్మ. టీం ఇండియాకు టాప్-ఆర్డర్‌లో ఫ్లయింగ్ స్టార్ట్ ఇవ్వడంలో మాజీ కెప్టెన్ ప్రత్యేకంగా గుర్తింపు పొందారు. 2024 వరల్డ్ కప్ తర్వాత రిటైర్ అయినా T20 వరల్డ్ కప్ లో రోహిత్ 44 ఇన్నింగ్స్ లలో 1220 పరుగులు సాధించాడు.
1. విరాట్ కోహ్లీ:
ఐసీసీ T20 వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగుల స్కోరర్ విరాట్ కోహ్లీ. కింగ్ కోహ్లీగా అభిమానులు ముద్దుగా పిలుచుకోంమే ఈయన T20 క్రికెట్‌లో చెరగని ముద్ర వేశాడు. 2012 నుండి ప్రపంచ కప్ జట్టు వెన్నుగా ఉన్నాడు కోహ్లీ. రన్ చేజ్ చేయడంలో ఛేజింగ్ మాస్టర్ లా, ఆపద సమయంలో ఉత్తమ ఇన్నింగ్స్ లు ఆడటం కోహ్లీకి వెన్నతో పెట్టిన విద్య. ఈ పరుగుల మిషన్ కూడా 2024 వరల్డ్ కప్ తర్వాత రిటైర్ ప్రకటించిన విషయం తెలిసిందే. కోహ్లీ కేవలం 33 ఇన్నింగ్స్ లలో 1292 పరుగులు సాధించి టాప్ స్కోరర్ గా ఉన్నాడు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!