Rohit Sharma: టీ20 వరల్డ్ కప్ కి ఎంపిక చేసిన జట్టుపై స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలకీ జట్టులో చోటు కల్పించే మార్గాన్ని టీమిండియా యాజమాన్యం వెతకాలని సూచించారు. ఈ ఇద్దరూ నిరంతరం వికెట్లు తీసే సామర్థ్యం కలిగిన బౌలర్లు, ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచుతారని సూచించాడు. గత కొంతకాలంగా వరుణ్ చక్రవర్తి టీ20 ఫార్మాట్‌లో తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుండగా, కుల్దీప్ యాదవ్‌కు తగిన అవకాశాలు ఇవ్వడం లేదన్నారు. టీమ్ మేనేజ్‌మెంట్ రెండో స్పిన్నర్‌గా ఆల్‌రౌండర్‌ను ఆడించడంపై ఎక్కువగా దృష్టి పెట్టడంతో, తుది జట్టులో అక్షర్ పటేల్ లేదా వాషింగ్టన్ సుందర్ లలో ఎవరో ఒకరికి వరుసగా ఛాన్స్ లు లభిస్తున్నాయని రోహిత్ శర్మ చెప్పుకొచ్చారు.
Read Also: Komalee Prasad: పవర్‌ఫుల్ ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ.. తమిళంలో అరంగేట్రం చేసిన తెలుగు హీరోయిన్!
ఇక, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ కాంబినేషన్ కావాలంటే ఇద్దరు సీమర్లతోనే ఆడాల్సి వస్తుంది.. ఇది పెద్ద సవాల్ అని రోహిత్ అన్నారు. కానీ, నిజం చెప్పాలంటే వరుణ్- కుల్దీప్ ఇద్దరినీ ఆడించడం మంచిదని పేర్కొన్నారు. వాళ్లు వికెట్ టేకర్లు, బ్యాట్స్‌మెన్స్ వాళ్ల బౌలింగ్‌ను రీడ్ చాలా కష్టం అన్నారరు. నేను గానీ కెప్టె్న్ అయితే ఖచ్చితంగా వాళ్లిద్దరినీ ఎంచుకుంటాను అని హిట్ మ్యాన్ జియో హాట్‌స్టార్‌లో ప్రసారమైన ‘Captain Rohit Sharma’s Roadmap for the T20 World Cup’ కార్యక్రమంలో తెలిపారు.
Read Also: Gambhir-Shreyas Rift: గంభీర్ భారత క్రికెట్‌కు ప్రమాదకరం.. రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు!
అయితే, ఇద్దరు స్పిన్నర్లను ఒకేసారి ఆడించడంలో ఉన్న సవాళ్లను కూడా రోహిత్ శర్మ గుర్తించారు. కుల్దీప్‌కు చోటు కల్పించేందుకు ఒక సీమర్‌ను పక్కన పెట్టడం సరైన నిర్ణయం కాకపోవచ్చు.. ఎందుకంటే, డ్యూ (తేమ) కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. అందుకే తుది నిర్ణయాన్ని టీమ్ మేనేజ్‌మెంట్, ప్రస్తుత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పై వదిలేశానని హిట్ మ్యాన్ స్పష్టం చేశారు. అవసరమైతే భారత్ ముగ్గురు స్పిన్నర్లతో కూడా బరిలోకి దిగవచ్చని.. కానీ, అది పూర్తిగా పిచ్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని అన్నారు. భారతదేశంలోని వాతావరణ పరిస్థితులను చూస్తే, న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఈ సిరీస్‌లాగే చాలా చోట్ల డ్యూ ఎక్కువగా ఉంటుంది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో శీతాకాలం ముగియడంతో దాదాపు అన్ని ప్రాంతాల్లో తేమ ఉంటుంది.. ముంబైలో కూడా చలి ఎక్కువగా లేకపోయినా డ్యూ ప్రభావం మాత్రం ఉంటుందని రోహిత్ వెల్లడించారు.
కాగా, భారతదేశంలోని 90 నుంచి 95 శాతం మైదానాల్లో డ్యూ కీలక పాత్ర పోషిస్తుంది అని టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపారు. ఇదే అసలైన సవాల్.. కోచ్, కెప్టెన్ ఏమనుకుంటున్నారు? ముగ్గురు స్పిన్నర్లతో ఆడేందుకు వాళ్లు సౌకర్యంగా ఉన్నారా? అలా అయితే స్పిన్‌కు అవకాశం ఉంటుంది.. కానీ ఒక పేసర్‌ను తప్పించాల్సి వస్తుంది.. అది సరైనదో కాదో టీమ్ నాయకత్వ ఆలోచనలపై ఆధారపడి ఉంటుందని రోహిత్ శర్మ పేర్కొన్నారు.