Team India: టీ20 ప్రపంచకప్ తర్వాత టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు న్యూజిలాండ్ పర్యటన నుంచి సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. అయితే బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌లో రెండో వన్డేలో రోహిత్ గాయపడ్డాడు. స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఎడ్జ్ తీసుకొని తనవైపు వచ్చిన బంతిని పట్టుకునే ప్రయత్నంలో అది రోహిత్ బొటనవేలిని బలంగా తాకింది. ఈ క్రమంలో అతడు క్యాచ్ కూడా జారవిడిచాడు. అప్పటికే బొటన వేలి నుంచి రక్తం కారుతుండటంతో మైదానం వీడాడు. వెంటనే…