భార్యగా, తల్లిగా, ఉద్యోగినిగా.. అన్ని బాధ్యతల్నీ ఓ మహిళ ఒంటిచేత్తో సమన్వయం చేసుకుంటుంది. అలానే ఏదైన ఆపద వచ్చినా.. ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటుంది. ఎంతోమంది మహిళలు తమ కుటుంబం కోసం అసాధారణమైన ధైర్యాన్ని ప్రదర్శించడం మనం చూశాం. తాజాగా పంజాబ్‌కు చెందిన ఒక మహిళ ఇంట్లో దొంగతనికి వచ్చిన ముగ్గురు దుండగులను అడ్డుకుంది. ఆ మహిళ ధైర్యం, బలం ముందు ఆ దొంగలు ఏమీ చేయలేకపోయారు. చివరికి ఆ దొంగలు పారిపోవాల్సి వచ్చింది. వివరాల ప్రకారం… అమృత్‌సర్‌లోని…
బుడమేరు వరద నీటిలో చిక్కుకుని సర్వం కోల్పోయాం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న బెజవాడవాసులు. మరోపక్క దొంగలతో భయంతో వణుకుపోతున్నాం అంటున్నారు.. అర్ధరాత్రి దొంగతనానికి వచ్చి కత్తులతో బెదిరిస్తున్నారు.. ఉన్నకాడికి దోచుకుంటున్నారు.. ముఖ్యంగా వన్ టౌన్ పరిధిలో పలు ఘటనలు చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది.. అయితే, దొంగలు బారి నుండి మమ్మల్ని పోలీసులే రక్షించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.. ముత్యాలంపాడు.. శ్రీనగర్ కాలనీలో మూడు బైకులు చోరీకి గురైనట్టు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కాలనీవాసులు. దొంగలు బారి నుండి…
తండ్రి కొడుకుకు ఆదర్శంగా ఉండాలి. తన కుమారుడు సమాజంలో తనకంటు ఓ మంచి పేరు తీసుకురావాలని తండ్రి కలలు కంటాడు. కానీ.. ఇక్కడ తండ్రి దొంగ అయితే.. తన కొడుకు గజదొంగగా మారాలని ఆశించాడు. తండ్రిపై ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో 70 కు పైగా కేసులు ఉంటే.. అతితక్కువ వయసులో పుత్రుడు మాత్రం 42 కేసులను క్రాస్ చేశాడు.
హర్యానాలో చైన్‌స్నాచర్లు రెచ్చిపోయారు. ఇద్దరు అగంతకులు చైన్ చోరీకి ప్లాన్ వేశారు. అంతే రోడ్డు ప్రక్కన ఉన్న షాపు దగ్గర ఉన్న మహిళ మెడలోంచి చైన్ లాక్కుని.. బైక్ ఎక్కి పారిపోతుండగా.. దూరం నుంచి గమనిస్తున్న ఓ బస్సు డ్రైవర్ సాహసం చేసి వారిద్దరిని ఢీకొట్టాడు.
ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలో మూకుమ్మడి హత్య ఘటన వెలుగు చూసింది. దొంగతనం చేయాలనే ఉద్దేశ్యంతో ఓ ఇంట్లోకి ప్రవేశించిన ముగ్గురు దొంగలను గ్రామస్థులు చితకబాదారు. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
తేజ సజ్జ, ప్రియాంక వారియర్ నటించిన ‘ఇష్క్’ సినిమా చూసే ఉంటారు. ఒంటరిగా కనిపించిన జంటను పోలీసులమని చెప్పి ఇద్దరు బెదిరించి వారి వద్ద డబ్బు గుంజుతారు. అంతేకాకుండా అమ్మాయితో అసభ్యకరంగా మాట్లాడతాడు. సేమ్ ఇదే తరహాలో ఇద్దరు వ్యక్తులు తిరుపతిలో ఒంటరిగా కనిపించిన జంటలకు పోలీసులు అని చెప్తూ దాడికి పాల్పడుతున్నారు. తిరుపతిలో అర్ధరాత్రి రోడ్లపై ఎవరైనా జంట కనిపిస్తే ఈ ఇద్దరు నిందితులు తాము పోలీసులమని, తమ వద్ద ఉన్న డబ్బు, నగలు ఇచ్చేస్తే…
దేశంలో రోజు ఏదో ఒక మూల ఆడగాళ్లపై అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి.. వాళ్లు ఎక్కడున్నా రక్షణ కరువవుతోన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి… తాజాగా, మహారాష్ట్ర ఠాణె జిల్లాలో దారుణం వెలుగు చూసింది.. శుక్రవారం రాత్రి రైలులోకి ప్రవేశించిన గుర్తుతెలియని దుండగులు.. రైలులో ఉన్నవాళ్లను భయబ్రాంతులకు గురిచేస్తూ బీభత్సం సృష్టించారు. ప్రయాణికుల వద్ద నుంచి డబ్బు, నగలు దోచుకున్నారు.. ఆపై ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. లఖ్‌నవూ నుంచి ముంబై…
సాధారణంగా దొంగలు దొంగతనం చేసే సమయంలో ఎవరైనా అడ్డువస్తే వాళ్లను చంపడానికైనా వెనుకాడరు. బెదిరించి దొంగతనం చేస్తారు. దొరికిన సొమ్మును ఎత్తుకుపోయే ముందు వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్తారు. కానీ, ఈ దొంగలు మాత్రం దానికి విరుద్దంగా చేశారు. బెదిరించి దొచుకున్న డబ్బు, బంగారంతో తిరిగి వెళ్తూ ఆ ఇంటి యజమాని కాళ్లకు మొక్కారట. అంతేకాదు, తీసుకున్న డబ్బులను ఆరునెలల లోగా తిరిగి ఇస్తామని చెప్పి వెళ్లారట. వెళ్తూ వెళ్తూ రూ.500 ఆ ఇంటి యజమానికి ఇచ్చి…