Viral Video: ‘సూపర్ ఉమెన్’.. ముగ్గురు దొంగలను ఒంటిచేత్తో అడ్డుకుంది! వీడియో వైరల్
- అసాధారణమైన ధైర్యాన్ని ప్రదర్శించిన పంజాబ్ మహిళ
- ఒంటిచేత్తో ముగ్గురు దుండగులను అడ్డుకుంది
- సూపర్ ఉమెన్ అంటూ ప్రశంసలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భార్యగా, తల్లిగా, ఉద్యోగినిగా.. అన్ని బాధ్యతల్నీ ఓ మహిళ ఒంటిచేత్తో సమన్వయం చేసుకుంటుంది. అలానే ఏదైన ఆపద వచ్చినా.. ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటుంది. ఎంతోమంది మహిళలు తమ కుటుంబం కోసం అసాధారణమైన ధైర్యాన్ని ప్రదర్శించడం మనం చూశాం. తాజాగా పంజాబ్‌కు చెందిన ఒక మహిళ ఇంట్లో దొంగతనికి వచ్చిన ముగ్గురు దుండగులను అడ్డుకుంది. ఆ మహిళ ధైర్యం, బలం ముందు ఆ దొంగలు ఏమీ చేయలేకపోయారు. చివరికి ఆ దొంగలు పారిపోవాల్సి వచ్చింది.
వివరాల ప్రకారం… అమృత్‌సర్‌లోని వెర్కా ప్రాంతంలో జగ్జిత్ సింగ్ అనే నగల వ్యాపారి నివాసం ఉంటున్నాడు. అతడికి భార్య మండూప్ కౌర్, ఇద్దరు పిల్లలు ఉన్నారు. జగ్జిత్ ప్రతిరోజు ఉదయాన్నే తన బంగారం షాపుకి వెళుతాడు. మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో మండూప్ తన పిల్లలతో కలిసి ఇంట్లో ఉంది. ఆయుధాలతో ముగ్గురు దొంగలు గోడ దూకి ఇంటి లోపలికి రావడాన్ని ఆమె గమనించింది. ఆమె వెంటనే అప్రమత్తమైన మండూప్.. అన్ని గదులకు తాళం వేసింది. పిల్లలను మరో గదిలో ఉంచింది.
Also Read
- Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
- AP High Court: గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆధారాలు, డాక్యుమెంట్లు ఇవ్వాలని ఆదేశం
- US-Iran: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా భారీ షాక్.. ఎల్లుండి నుంచి ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోనున్న సర్వీసులు!
- Trump: పుతిన్ యుద్ధం ముగించాలనకుంటున్నారు.. జెలెన్స్కీనే హద్దు దాటారు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ముగ్గురు దుండగులు ఇంటి ప్రధాన ద్వారం తలుపులు తెరిచేందుకు ప్రయత్నించారు. లోపల నుంచి మండూప్ కౌర్ తలుపు మూయడానికి తీవ్రంగా ప్రయత్నించింది. అవతలి నుంచి ముగ్గురు దొంగలు ఎంత ప్రయత్నం చేసినా.. ఆమె వెనకడుగు వేయలేదు. దాదాపు 10-15 నిమిషాల పాటు దొంగలను అడ్డుకుంది. చివరకు తలుపు మూసి.. పక్కనే ఉన్న సోఫాను అడ్డుగా పెట్టింది. దాంతో దొంగలు లోపలికి ప్రవేశించలేకపోయారు. మండూప్ గట్టిగా అరవడమే కాకుండా.. ఇరుగుపొరుగు వారికి కాల్ చేసింది. దాంతో దుండగులు అక్కడినుంచి పారిపోయారు.
Also Read: IND vs NZ: టిమ్ సౌథీ షాకింగ్ డెసిషన్.. టీమిండియాతో టెస్టు సిరీస్‌కు కెప్టెన్ ఎవరంటే?
సమాచారం అందుకున్న జగ్జిత్ సింగ్ ఇంటికి చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారంగా దొంగలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. మండూప్ కౌర్ చేసిన ధైర్యసాహసాలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. అసాధారణమైన ధైర్యాన్ని ప్రదర్శించిన ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ‘సూపర్ ఉమెన్’ అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Robbers tried to loot a house, But the robbers could not do anything in front of the Brave Woman present in the house. The brave woman single-handedly overpowered three robbers🫡, Amritsar
pic.twitter.com/NQuAwauAYf— Ghar Ke Kalesh (@gharkekalesh) October 1, 2024
తాజావార్తలు
-
Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
-
Kasarla Shyam: “గద్దల నెత్తులు నరికిన కాకుల రాజ్యం”.. ‘ది ప్యారడైజ్’పై కాసర్ల శ్యామ్ గూస్బంప్స్ స్పీచ్!
-
The Paradise : ఏపీలో ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల హైక్
-
AP High Court: గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆధారాలు, డాక్యుమెంట్లు ఇవ్వాలని ఆదేశం
-
US-Iran: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా భారీ షాక్.. ఎల్లుండి నుంచి ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోనున్న సర్వీసులు!
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!