తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం.. రెండు రాష్ట్రాల్లో రోడ్ల అభివృద్ధి కోసం నిధులు కేటాయించింది కేంద్రం.. అందులో ఆంధ్రప్రదేశ్‌కు 498 కోట్ల రూపాయలు కేటాయించగా.. తెలంగాణకి 516 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది.
దేశంలో చోటుచేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాలపై బుధవారం రాజ్యసభలో ఆయన లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. జెనీవాలోని ఇంటర్నేషనల్ రోడ్ ఫెడరేషన్ విడుదల చేసిన వరల్డ్ రోడ్ స్టాటిస్టిక్స్ (డబ్ల్యూఆర్‌ఎస్) 2018 ప్రకారం.. రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య విషయంలో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు. మరోవైపు రోడ్డుప్రమాదాల్లో క్షతగాత్రుల విషయంలో మాత్రం భారత్ మూడో స్థానంలో ఉందని తెలిపారు. 2020 సంవత్సరానికి 18…