మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుల్గానాలోని సమృద్ధి ఎక్స్‌ప్రెస్ వే పై ఐరన్‌లోడ్ తో వెళ్తున్నలారీ బోల్తా పడింది. ఆ ఘటనలో 13 మంది మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. టిప్పర్ లారీపై 16 మంది కూలీలు ఐరల్‌లోడ్‌పై కూర్చోని ప్రయాణం చేస్తున్నారు. సడన్‌గా ఎక్స్‌ప్రెస్ వే పై అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. రోడ్డుపై మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోవడంతో ఆ…
ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్యకు ప్రమాదం తప్పింది.. ఆయన ప్రయాణిస్తున్న కారు టేకులపల్లి సమీపంలో అదుపుతప్పి బోల్తా పడడంతో ప్రమాదం జరగగా.. ఈ ఘటనలో ఆయనకు స్వల్పగాయాలు అయినట్టుగా చెబుతున్నారు.. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని నర్సయ్యను చికిత్స కోసం ఇల్లందు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయనకు ప్రథమ చికిత్స నిర్వహించారు.. ఈ ప్రమాదంలో కారు కూడా స్వల్పంగా దెబ్బతిన్నట్టుగా తెలుస్తోంది.. కొత్తగూడెం నుంచి ఇల్లందు వైపు వెళ్తుండగా కారు ప్రమాదానికి గురైనట్టుగా…
మాలీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 41 మంది మృతి చెందగా, 33 మందికి తీవ్రగాయాలయ్యాయి. సామాగ్రీ, కూలీలతో వెళ్తున్న లారీని ప్రయాణికులతో వెళుతున్న బస్సు ఢీకొన్నది. ఈ ప్రమాదంలో 41 మంది అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన 33 మందిని ప్రమాదం జరిగిన ప్రాంతానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న సెగో పట్టణానికి తరలించి వైద్యం అందిస్తున్నారు. హెవీ లోడ్‌తో వెళ్తున్న లారీ టైర్ పేలడంతో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టింది.…
హైదరాబాద్ – శ్రీశైలం హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలో అచ్చపేట మండలం చెన్నారం గేట్ దగ్గర శ్రీశైలం హైవేపై రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు విడిచారు.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో రెండు కార్లు నుజ్జునుజ్జయ్యాయి. ఇక, ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్.. ప్రమాదం గురించి తెలిసిన…
పాకిస్తాన్‌లో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. పంజాబ్ ప్రావిన్స్‌లో జరిగిన ఈ ప్రమాదంలో 30 మంది మృతి చెందారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ప్రమాదంలో 40 మందికి గాయాలయ్యాయి. బక్రీద్ పండుగ సందర్భంగా సుమారు 70మందికి పైగా కార్మికులు సియాల్‌కోట్ నుంచి రజన్‌పూర్‌కు పయనమయ్యారు. వీరు ప్రయాణిస్తున్న వాహనం ముజప్పర్‌గడ్‌లోని డేరాఘాజీ ఖాన్ వద్ద ఇండస్ హైవేపై ఎదురుగా వస్తున్న కంటైనర్‌ను ఢీకొన్నది. ఈ ప్రమాదంలో 30 మంది అక్కడికక్కడే మృతి చెందగా 40…
ప్రముఖ సినీ విమర్శకుడు, నటుడు, రచయిత, దర్శకుడు కత్తి మహేశ్ చెన్నైలో కన్నుమూశారు. కొద్దికాలం క్రితం నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానిక హాస్పిటల్ లో చేర్చి ప్రాధమిక చికిత్స చేసిన అనంతరం బంధువులు చెన్నయ్ లో అపోలో హాస్పిటల్ కు తరలించారు. అక్కడే కంటికి, తల భాగానికి శస్త్ర చికిత్స చేశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కి తొలి నుంచి సేవలు అందిస్తున్న కత్తి మహేశ్ కు ఆంధ్ర…
నెల్లూరు జిల్లాలోని గూడూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి నుండి రాజమండ్రికి వెళ్తుండగా లారీ-కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మృతులు వీరయ్య, వరలక్ష్మీ, మణికంఠ, స్వాతిలుగా ఉన్నారు. లిఖిత (16) అనే యువతికి తీవ్ర గాయాలు కాగా, నెల్లూరు ఆస్పత్రికి తరలించారు. ఈ జాతీయ రహదారిపై కొంతకాలంగా బ్రిడ్జి నిర్మాణం జరుగుతోంది, దీంతో నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇవాళ జరిగిన…
అమెరికాలో తుఫాన్ తాకిడితో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అలబామా ప్రాంతంలో తుఫాను విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో ఇంటర్‌స్టేట్ హైవేపై జరిగిన ఈ ప్రమాదంలో 8 మంది చిన్నారులు సహా 10 మంది దుర్మరణం పాలయ్యారు. రహదారి సరిగా కనిపించకపోవడంతో గ్రీన్విల్లే నగర సమీపంలోని రహదారిపై ప్రయాణిస్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఘటనలో కనీసం 15 కార్లు చిక్కుకొన్నాయని అధికారులు తెలిపారు. ఇక్కడ వచ్చిన వరదలు, టొర్నడోలు చాలా ఇళ్లను ధ్వంసం చేశాయని అధికారులు వివరించారు. ఈ…
నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బస్సులు ఢీకొనడంతో 18 మంది మృతి చేందారు. పలువురికి తీవ్రమైన గాయాలయ్యాయి. నైజీరియాలోని జిగువా ప్రాంతంలో ఎదురెదురుగా వస్తున్న రెండు బస్సులు డీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. రోడ్లు అద్వాన్నంగా ఉండటం, బస్సుల్లో రద్దీ ఎక్కువగా ఉండటంతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదానికి రాష్ డ్రైవింగ్ కారణం అయి ఉండోచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ఓ బస్సు డ్రైవర్ కాలు విరిగిపోయింది. ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు అ…
కామారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. లారీ అదుపుతప్పి ట్రాక్టర్ ను ఢీకొట్టడంతో ఓ మహిళా మృతి చెందింది. అంతేకాదు 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. తాడ్వాయి మండలం కృష్ణాజివాడిలో మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. జువ్వాడి నుంచి కామారెడ్డి మండలం లింగాపూర్ గ్రామంలో జరిగే వివాహానికి కొందరు ట్రాక్టర్ లో పెళ్లి సామగ్రితో తీసుకెళ్తున్నారు. కృష్ణాజివాడి వద్దకు రాగానే ట్రాక్టర్ ను వెనుక నుంచి లారీ ఢీ కొట్టడంతో 16 మందికి తీవ్ర…