కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మాజీ మిస్ కేరళ అన్సీ కబీర్(25), రన్నరప్ అంజనా షాజన్(26) దుర్మరణం చెందారు. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన కేరళలో సంచలనంగా మారింది. సోమవారం ఉదయం ఒంటిగంట సమయంలో మాజీ మిస్ కేరళ అన్సీ కబీర్, రన్నరప్ అంజనా షాజన్ మరో ఇద్దరు స్నేహితులతో కలిసి కారులో వస్తుండగా ఎర్నాకుళం బైపాస్‌లోని హాలిడే ఇన్ ముందు బైక్ ని తప్పించబోయి కారు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో…
సాధారణంగా ఏదైనా ప్రమాదంలో వ్యక్తి చనిపోతే అతని భార్య లేదా పిల్లలకు, లేదా తల్లిదండ్రులకు పరిహారం పొందే హక్కు వుంటుంది. అయితే అల్లుడి దగ్గర అత్త నివాసం ఉంటే మాత్రం ఆమెకు కూడా నష్టపరిహారం పొందేందుకు అర్హురాలేనని దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. అల్లుడి ఇంట్లో నివసిస్తున్న అత్త కూడా అతనికి చట్టబద్ధ ప్రతినిధి అవుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మోటారు వాహనాల చట్టం కింద పరిహారం పొందడానికి ఆమె అర్హురాలేనని పేర్కొంది. న్యాయమూర్తులు జస్టిస్…
మితిమీరిన వేగం ఓ మహిళ ప్రాణం తీసింది. నార్సింగి మీర్జాగూడ చౌరస్తాలో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న మహిళను ఢీ కొట్టిన కారు వేగంగా ముందుకు వెళ్ళబోయింది. స్పాట్ లోనే మృతి చెందింది ఓ మహిళ. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తం అయ్యారు. కారు వదిలేసి పారిపోతున్న డ్రైవర్ ను వెంబడించి పట్టుకున్న స్థానికులు. దేహ శుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. మృతురాలు అదే ప్రాంతానికి చెందిన పద్మగా గుర్తించారు. మితిమీరిన వేగం, నిర్లక్ష్యంగా…
తెలంగాణ ప్రభుత్వ విప్ రేగా కాంతారావుకు తృటిలో పెద్ద ప్రమాదమే తప్పింది… ములుగు జిల్లా ఏటూరునాగారం ప్రధాన రహదారిపై జీడివాగు వద్ద రేగా కాంతారావు కారు బోల్తా పడింది… బైక్‌ని ఓవర్ టెక్ చేయబోయిన సమయంలో.. కారు అదుపుతప్పి చెట్టుకుని ఢీకొట్టింది.. ఆ తర్వాత రోడ్డుకిందకి దూసుకెళ్లి బోల్తా పడింది.. ఈ సమయంలో కారులో ఉన్న ఇద్దరు డ్రైవర్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.. అయితే, ప్రమాదం సమయంలో కారులో రేగా కాంతారావు లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ కాటేదాన్ లో విషాదం చోటు చేసుకుంది. జీహెచ్ఎంసీ ఆర్ అండ్ బి అధికారుల నిర్లక్ష్యానికి యువకుడు బలి అయ్యాడంటూ స్థానికులు అంటున్నారు. రామ్ చరణ్ ఆయిల్ మిల్లు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు బైక్ పై నుండి కింద పడ్డాడు యువకుడు. యువకుని పై నుండి దూసుకు వెళ్ళింది కంటైనర్. స్పాట్ లోనే మృతి చెందాడు యువకుడు. దాంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. ఆ…
ఒక్కోసారి జరగే ప్రమాదాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఎందుకు అలా ప్రమాదాలు జరుగుతాయో తెలియదుగాని, నవ్వు తెప్పిస్తుంటాయి. అలాంటి వాటిల్లో ఈ ప్రమాదం కూడా ఒకటి. లోడ్‌తో వెళ్తున్న లారీ ఓ మలుపు దగ్గరికి రాగానే సడెన్ గా కిందపడిపోయింది. అలా కిందపడిన లారీ రెండు ముక్కలయింది. లారీ పైభాగం వేరుగా కిందపడగా కింద ఉన్న బేస్, మాత్రం అలాగే పరుగులు తీసింది. క్రిందపడిన డ్రైవర్ వెంటనే లేచి ఆ లారి కోసం పరుగులు తీశారు. ఇలాంటి…
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కి రోడ్డు ప్రమాదానికి గురైయ్యాడు.. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ – 45 కేబుల్ బ్రిడ్జ్ మార్గంలో ఈ ప్రమాదం జరిగింది. స్పోర్ట్స్ బైక్ నుంచి ఆయన కిందపడ్డారు.. తీవ్రగాయాలు కావడంతో సాయి ధరమ్ తేజ్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. కేబుల్ బ్రిడ్జి దాటాక కోహినూర్ హోటల్ సాయి ధరమ్ తేజ్ స్పోర్ట్స్ బైక్ నుంచి ఒక్కసారిగా కిందపడ్డారు. అనంతరం స్థానికులు, పోలీసులు ఆయనను మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం…
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. తుర్లపాడు మండలం రోలుగుంపాడులోని ఎస్టీ కాలనీ వద్ద టాటా ఏస్ వాహనం బోల్తా పడిన ఘటనలో అక్కడికక్కడే ఐదుగురు మృతిచెందారు.. రోడ్డుపై చనిపోయిన గేదెపైకి దూసుకెళ్లిన టాటా ఏస్ వాహనం అదుపుతప్పి బోల్తా పడడంతో ఈ ప్రమాదం జరిగింది.. స్పాట్లోనే ఐదుగురు మృతిచెందగా.. మరో 10 మందికి తీవ్ర గాయాలు అయినట్టుగా చెబుతున్నారు.. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.. క్షతగాత్రులను చికిత్స కోసం ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి…
హైదరాబాద్ శివార్లలోని చేవెళ్ల దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకొంది. ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టినట్లు సమాచారం. చేవెళ్ల మండలం దేవుని ఎర్రవల్లి గ్రామానికి చెందిన యువకులుగా గుర్తించారు. మృత్యువులోనూ వీడని స్నేహబంధం ఆ మిత్రుల ఆనందాన్ని చూసి.. విధికి కన్ను కుట్టిందో ఏమో.. అప్పటి దాకా ఆనందోత్సాహాలతో గడిపిన ముగ్గురు మిత్రులు అంతలోనే విగత జీవులయ్యారు. ఫ్రెండ్ బర్త్ డే కు కేక్ కోసమని. .బైక్…
నల్గొండ జిల్లా మిర్యాలగూడ చింతపల్లి హైవే వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని శ్రీ కృష్ణ ట్రావెల్స్ బస్ ఢీ కొట్టింది. అయితే.. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో పది మంది కి తీవ్ర గాయాలు అయ్యాయి. Ap39x6414 నెంబర్ గల శ్రీ కృష్ణ ట్రావెల్స్ బస్సు ఒంగోలు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక క్షత గాత్రులను మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు…