మన సంప్రదాయంలో ఎన్నో విశిష్టతలు వున్నాయి. చనిపోయింది మనిషైనా, చివరికి జంతువైనా దానికి అంతిమ సంస్కారాలు చేయడం పరిపాటి. చనిపోయిన ఒక వానరానికి అంత్యక్రియలు జరిపారు ఓ గ్రామస్తులు. చనిపోయింది కోతే కదా అని వదిలేయలేదు అక్కడి ప్రజలు. దానిని దైవస్వరూపంగా భావించి అత్యంత వైభవంగా అంతిమ యాత్ర నిర్వహించారు. గ్రామంలోని ప్రజలందరూ ఆ యాత్రలో పాల్గొనడం విశేషం. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం మైలారం గ్రామంలో రోడ్డు ప్రమాదంలో ఓ వానరం మరణించింది. మనం…
రోడ్డు ప్రమాదాలు కామన్ అయిపోయాయి. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించడం విషాదం నింపింది. ఘన్పూర్(ఎం) వద్ద ఆర్టీసీ బస్సు కారును ఢీ కొట్టిన ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సాయంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. సిరిసిల్ల వైపు నుంచి కరీంనగర్-1 డిపో బస్సు కామారెడ్డికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జయింది. ప్రమాదం కారణంగా…
కోలీవుడ్ స్టార్ హీరో శింబు కుటుంబం చిక్కుల్లో పడింది. నిర్లక్ష్యంగా కారునడిపి ఒక వృద్ధుడి ప్రాణం తీసినందుకు శింబు కారు డ్రైవర్ సెల్వం ని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే.. మార్చి 18 అర్ధరాత్రి శింబు తండ్రి, నటుడు టి. రాజేందర్, తన మనవరాలిని హాస్పిటల్ కి తీసుకెళ్లి తీసుకొస్తుండగా.. మార్గమధ్యంలో ఒక వృద్ధుడు పాకుతూ రోడ్డు దాటుతున్నాడు. ఇక ఈ…
కలియుగ వైకుంఠం తిరుమలకు భక్తులు పోటెత్తుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం 50 వేలమందికి పైగానే దర్శనాలు చేసుకుంటున్నారు. దీంతో ఘాట్ రోడ్లు భక్తుల వాహనాలతో బిజీఅయిపోతున్నాయి. తిరుమల రెండో ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. హఠాత్తుగా ఓ కారులో మంటలు వ్యాపించాయి. క్షణాల్లోనే ఆ కారు అగ్నికి ఆహుతైంది. కర్నూలుకు చెందిన భక్తులు కారులో తిరుమల కొండపైకి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. రెండో ఘాట్ రోడ్డు ఆఖరి మలుపు వద్ద కారులో మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది.…
కెనడాలోని టొరంటోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు భారతీయులు మృతి చెందారు. శనివారం జరిగిన ఈ ప్రమాదంలో ట్రాక్టర్ ట్రాలీని ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు భారతీయ విద్యార్థుల సహా మరో ఇద్దరు గాయపడ్డారని, వారిని ఆస్పత్రికి తరలించామని కెనడాలోని భారత రాయబారి అజయ్ బైసారియా వెల్లడించారు. బాధితుల స్నేహితులతో ఎంబసీ అధికారులు టచ్లో ఉన్నారని తెలిపారు. బాధితుల కుటుంబాలకు అన్ని విధాలుగా సహకరిస్తామని పేర్కొన్నారు. కాగా మృతులను హర్ప్రీత్ సింగ్,…
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మంది తీవ్ర గాయాలపాలయ్యారు. యాదాద్రి జిల్లాలోని ఆలేరు బైపాస్ రోడ్డులో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నిర్మాణ ప్రాంతంలో ట్రాక్టర్ ఉండి. ఆ పక్కనే కూలీలు పని చేస్తున్నారు. ఈ సమయంలో వరంగల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వరంగల్ నుంచి హైదరాబాద్కు వెళ్తోంది. అయితే, వేగంగా వచ్చిన…
రోడ్డు ప్రమాదాలు మామూలైపోయాయి. మితిమీరిన వేగం, కొద్దిపాటి నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. మేడ్చల్ జిల్లాలో చెక్ పోస్ట్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు మరణించారు. అదుపు తప్పి డివైడర్ ని గుద్దుకుంది మారుతీ ఈకో వాహనం. ఈ వాహనంలో తొమ్మిది మంది ఉన్నట్లు సమాచారం. అక్కడికక్కడే ఒకరు మృతి చెందగా మరొకరు హాస్పిటల్ తరలిస్తుండగా ఇంకొకరు మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరణించినవారిని గోరి సింఘ్, బబ్లీ సింఘ్ గా గుర్తించారు. మేడ్చల్…
సోషల్ మీడియాలో కచ్చా బాదమ్ పాటతో పల్లీల వ్యాపారి భుబన్ బద్యాకర్ రాత్రికి రాత్రే స్టార్ అయిపోయాడు. అయితే అతడు రోడ్డుప్రమాదానికి గురయ్యాడు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని బీర్భూమ్లో తాను కొనుగోలు చేసిన సెకండ్ హ్యాండ్ కారును నేర్చుకుంటుండగా భుబన్ బద్యాకర్ ప్రమాదం బారిన పడ్డాడు. ఈ ఘటనలో బద్యాకర్ ఛాతీకి గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతడు స్థానికంగా ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు ధ్రువీకరించారు. కాగా కచ్చా బాదమ్…
రోడ్డు ప్రమాదాల కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. హైదరాబాద్ లో నిత్యం రోడ్డు ప్రమాదాల్లో మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా నిత్యం రద్దీగా వుండే గచ్చిబౌలి విప్రో జుంక్షన్ నుండి IIIT జుంక్షన్ వైపు బైక్ పై వస్తున్న ముగ్గురు యువకులు ప్రమాదానికి గురయ్యారు. ఇద్దరు మరణించగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. IIIT జుంక్షన్ వద్ద ఉన్న సబ్ స్టేషన్ గేట్ ను వేగంగా వచ్చి ఢీ కొట్టిందా బైక్. దీంతో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి…
వైసీపీ ముఖ్య నేత, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. కర్నూలు నగరంలోని సిల్వర్ జూబ్లీ కాలేజీ వద్ద ఫ్లైఓవర్పై సజ్జల కాన్వాయ్ వాహనాలు వెళ్తుండగా ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో సజ్జల కాన్వాయ్ వాహనాలు స్వల్పంగా దెబ్బతినగా.. సజ్జల సురక్షితంగా బయటపడ్డారు. ఓ వైసీపీ నేత నివాసంలో వివాహానికి హాజరై సజ్జల తిరిగి స్టేట్ గెస్ట్ హౌస్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కర్నూలులోని డోన్ రోడ్డులో శనివారం పత్తికొండకు…