హైదరాబాద్ కూకట్పల్లిలో ఆదివారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదం సంభవించింది. కేపీహెచ్బీ రోడ్డు నంబర్ 1 సమీపంలో గాంధీ విగ్రహం వద్ద రోడ్డుపై వెళ్తున్న బైక్ను టిప్పర్ లారీ ఢీకొట్టిన ఘటనలో జగన్మోహన్ రెడ్డి అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. టిప్పర్ బైక్ను ఢీకొన్న తర్వాత 20 మీటర్ల పాటు మృతదేహాన్ని టిప్పర్ ఈడ్చుకుని వెళ్లింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. Read Also: పాలడుగు గ్యాంగ్ రేప్ ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు కాగా…
సంగారెడ్డి జిల్లాలో కొత్త సంవత్సరం రోజు విషాదం నెలకొంది. జహీరాబాద్ మండలం డిడ్గి వద్ద ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. అతి వేగంగా వచ్చిన కారు అమాంతం అదుపుతప్పి బైక్ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న దంపతులతో సహా 8 ఏళ్ల చిన్నారి మృతి చెందారు. వీరితో పాటు కారులో ప్రయాణిస్తున్న మరో యువకుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. కాగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై విచారణ చేపట్టారు. మృతులను…
హైదరాబాద్ లోని ఔటర్ రింగ్ రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారింది. ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మరణించారు. మరోముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. రాజేంద్రనగర్ హిమాయత్ సాగర్ ఔటర్ రింగ్ రోడ్డు పై ఈ ప్రమాదం జరిగింది. ముందు వెళుతున్న లారీని ఢీ కొట్టింది కారు. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఒకరు మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా వుందని పోలీసులు తెలిపారు. శంషాబాద్…
యువతకు బైక్ లంటే ఎంతో పిచ్చో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. మార్కెట్ లోకి కొత్త మోడల్ వచ్చిందంటే.. దాన్ని ఎంత ఖర్చుపెట్టి అయినా సొంతం చేసుకుంటారు. ఆ బండిపై రోడ్లపై విన్యాసాలు చేస్తూ తిరుగుతారు. ఇక వెనుక ప్రేమించిన అమ్మాయి కూడా ఉంటె .. గాల్లో తేలినట్టుందే అంటూ సాంగ్స్ వేసుకొని రెచ్చిపోతారు. తాజాగా ఒక కుర్రాడు కూడా అదే పని చేశాడు. కానీ, చివరికి హాస్పిటల్ పాలయ్యాడు. అతివేగంతో బైక్ ఫై స్టంట్ లు…
హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గచ్చిబౌలి హెచ్ సీయూ ఆర్టీసీ డిపో దగ్గర జరిగిన ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. వేగంగా దూసుకెళ్ళిన కారు.. అదుపు తప్పి డివైడర్ మధ్యలో చెట్టును ఢీకొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. అర్థరాత్రి 2.30 గంటల సమయంలో ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మానస,డ్రైవర్ అబ్దుల్ రహీం, మరొక జూనియర్ ఆర్టిస్ట్ మృతి చెందారు. సిద్దు అనే మరో…
భారత క్రికెట్ దిగ్గజ మాజీ ఆటగాడు సచిన్ టెండూల్కర్ సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో సచిన్ స్నేహితురాలు తీవ్రంగా గాయపడింది. ఆ సమయంలో వెంటనే స్పందించిన ట్రాఫిక్ కానిస్టేబుల్, పౌరులను ట్విటర్ వేదికగా సచిన్ అభినందించాడు. ట్రాఫిక్ కానిస్టేబుల్ను నేరుగా కలిసి ధన్యవాదాలు చెప్పినట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. రోడ్డు ప్రమాదంలో గాయపడి సీరియస్ కండిషన్లో ఉన్న తన స్నేహితురాలిని ట్రాఫిక్ కానిస్టేబుల్ ఓ ఆటోలో ఆస్పత్రికి తీసుకువెళ్లాడని..…
హైదరాబాద్లో రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. జూబ్లీహిల్స్లో అదుపు తప్పిందో బీఎండబ్ల్యూ కారు. రామానాయుడు స్టూడియో వద్ద ఉన్న మూలమలుపు వద్ద ఒక్కసారిగా బోల్తా కొట్టింది కారు. బెలూన్లు తెరుచుకోవడంతో ఘోర ముప్పు తప్పింది. గాయపడ్డ వ్యక్తిని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఫిలింనగర్ రామానాయుడు స్టూడియో నుంచి వేగంగా వెళుతున్న సమయంలో అదుపు తప్పింది బిఎండబ్ల్యు కారు. రామానాయుడు స్టూడియో వద్ద ఉన్న మూలమలుపు వద్ద ఒక్కసారిగా బోల్తా కొట్టిందా కారు. అతివేగం వల్ల రోడ్డు మధ్యలో…
రంగారెడ్డి జిల్లాలో హైవే నెంబర్ 163 విస్తరణకు రంగం సిద్ధమయింది. అయితే ఈ రహదారిలో ఎక్కువగా మర్రి చెట్లు వున్నాయి. వీటికి వందల ఏళ్ళ చరిత్ర వుందని పరిశోధకులు, పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. హైవే విస్తరణ కారణంగా వాటిని తిరిగి వేరేచోట పాతాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. పర్యావరణ సమతుల్యాన్ని కాపాడడానికి ఈ మర్రి చెట్లు ఎంతగానో దోహదం చేస్తున్నాయి. ఈ రహదారిపై ఇరువైపులా 900 మర్రిచెట్లు వున్నాయి. వాటిని భద్రంగా తీసి వేరేచోట భద్రపరచాలని పర్యావరణ…
హైదరాబాద్ లో వీకెండ్ వచ్చిందంటే చాలు కుర్రకారు రెచ్చిపోతోంది. మద్యం మత్తులో వేగంగా కారు నడుపుతూ లారీని ఢీకొట్టారు యువకులు. మేడ్చల్ జిల్లా దుండిగల్ పీఎస్ పరిధి బౌరంపేటలో ప్రమాదం జరిగింది. ఆగిఉన్న లారీని ఢీకొంది కారు. దీంతో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. బౌరంపేట కోకాకోలా కంపెనీ వద్ద అర్ధరాత్రి తర్వాత ఘటన జరిగింది. READ ALSO దూసుకొచ్చిన కారు.. తృటిలో తప్పిన ప్రాణాపాయం మద్యం మత్తులో వేగంగా కారు నడుపుతూ లారీని ఢీకొట్టారా యువకులు. ప్రమాదానికి…
వికారాబాద్ జిల్లా పీరంపల్లిలో తీవ్రం ఉద్రిక్తత నెలకొంది. రోడ్డుప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వ్యక్తులు మృతి చెందడంతో శవంతో డ్రైవర్ ఇంటి ముందు ఆందోళనకు దిగారు బంధువులు. వికారాబాద్ మండలం పీరంపల్లి గ్రామానికి చెందిన దాదాపు 15మంది ఓ వ్యాన్ లో ఈ నెల 9వ తేదీ తెల్లవారుజామున పువ్వులు తీసుకొని హైదరాబాద్ కు వెళ్తుండగా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతీరెడ్డి పల్లి గేటు దగ్గర టైర్ పేలీ వ్యాన్ బొల్తాకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ…