నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండలం తుర్కల పల్లి సమీపంలో పండుగ పూట ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి కల్వర్టుకు ఢీకొనడంతో నలుగురి మృతి చెందారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు మహిళలు వున్నారు. వీరంతా నల్గొండ జిల్లా నేరేడుచర్లకు చెందిన వారుగా గుర్తించారు.
నలుగురు మృతి చెందడంతో వారి కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతులంతా సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల వాసులుగా గుర్తించారు. ఐదుగురు కడప నుంచి తిరిగి వస్తుండగా మార్గమధ్యంలోనే కారు ప్రమాదానికి గురైంది. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు కాగా.. తీవ్రగాయాలైన మరో వ్యక్తిని కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారంటున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఉగాది పూట కుటుంబసభ్యులను కోల్పోయిన వారి వేదనలకు అంతేలేకుండా పోతోంది.