Road Accident: ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ధామ్తరి జిల్లాలో బుధవారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. బొలెరో ట్రక్కును ఢీకొట్టడంతో 10 మంది అక్కడిక్కడే మరణించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా అధికారులు గుర్తించారు. ఈ ప్రమాదంలో చిన్నారితో సహా పలువురు గాయపడ్డారు. ప్రస్తుతం గాయపడిన వారికి చికిత్స జరుగుతోంది.
మెక్సికోలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పశ్చిమ మెక్సికోలో బస్సు కొండపై నుండి పడిపోవడంతో కనీసం 18 మంది మరణించారు. ఈ ఘటనలో చనిపోయిన వారిలో 11 మంది మహిళలు, ఏడుగురు పురుషులు ఉన్నారు.
తాజాగా ఓ పిల్లవాడికి జరిగిన ఫన్నీ రోడ్ యాక్సిడెంట్ వీడియో కూడా ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఆ చిన్నారికి జరిగిన యాక్సిడెంట్ని చూసి నెటిజన్లు తెగ నవ్వేసుకుంటున్నారు. దీనిపై రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
Bus Overturns in Chhattisgarh:ఛత్తీస్గఢ్లో రోడ్డు ప్రమాదం జరిగింది. మోహ్లా మన్పూర్లో బస్సు బోల్తా పడింది. చిన్నారులతో సహా 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. దోండి లోహరా ప్రాంతం నుంచి కురేత గ్రామానికి బయలుదేరిన బస్సు శుక్రవారం బోల్తా పడటంతో ప్రయాణికులు గాయపడ్డారు.
Road Accident : రాత్రి భోజనం చేసిన తర్వాత చాలామందికి నడిచే అలవాటు ఉంది. ప్రతిరోజూ మాదిరిగానే నాసిక్ రహదారి వెంబడి కాసేపు నడిచేందుకు కొంతమంది మహిళలు జైలు రోడ్ కు వెళ్లారు. రోడ్డు మీద నడుస్తుండగా హఠాత్తుగా ఎదురైనన ఘటనతో నాసిక్ నగరమంతా ఉత్కంఠ నెలకొంది.
అల్లూరి జిల్లా పాడేరు సమీపంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఘాట్ రోడ్డుపై వెళుతుండగా ఒక్కసారిగా కారు అదుపతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో భార్యాభర్తలతో సహా ముగ్గురు మృత్యువాత పడ్డారు.
అయోధ్యలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు, బస్సు ఒకదానికొకటి ఢీ కొనడంతో ఏడుగురు మరణించారు. మరో 40మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Road Accident: విజయవాడలో ఓ ప్రైవేట్ బస్సు బోల్తా పడింది.. గొల్లపూడి సమీపంలో ఈ ఘటన జరిగింది.. విజయవాడ నుంచి హైదరబాద్ వైపు వెళ్తున్న BSR ట్రావెల్స్ కు చెందిన బస్సు ప్రమాదానికి గురైంది.. టిప్పర్ లారీ వచ్చి బస్సును ఢీ కొనడంతో ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.. ప్రమాద సమయంలో సుమారుగా 30 మంది బస్సుల్లో ప్రయాణం చేస్తున్నట్టు తెలుస్తోంది.. వీరిలో దాదాపు 20 మంది ప్రయాణికులు గాయాలపాలయ్యారు.. వారిని వెంటనే…
Pakistan : గత కొద్ది రోజులుగా ఆర్థిక సంక్షోభంతో కూరుకున్న పాకిస్తాన్ ప్రభుత్వానికి మరో దెబ్బ తగిలింది. పాకిస్థాన్ మత వ్యవహారాల శాఖ మంత్రి ముఫ్తీ అబ్దుల్ షాకూర్ రోడ్డు ప్రమాదంలో మరణించారు.