తెలంగాణలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి.. ఇప్పుడు మరో ఘోర ప్రమాదం జరిగింది..బిడ్జి పై నుంచి ఆటో బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.. బూర్గంపాడు శివారులోని ఆంధ్ర సరిహద్దు కిన్నెరసాని బ్రిడ్జి అప్రోచ్ రోడ్డుపై నుంచి మహీంద్రా ట్రాలీ బోల్తా పడింది.. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందగా మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఏలూరు జిల్లా టీ నర్సాపురం మండలం తిరుమలదేవిపేట గ్రామానికి చెందిన నరసింహారావు, దుర్గారావు, పచ్చి సాని శ్రీనివాసరావులకు చెందిన 12మంది కుటుంబ సభ్యులు మంగళవారం భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి దర్శనానికి వచ్చారు.. స్వామిని దర్శించుకున్నాక మధ్యాహ్నం తిరుగు ప్రయాణం అయ్యారు.. ఆ సమయంలోనే ఈ ప్రమాదం జరిగింది..
వీరంతా ప్రయానిస్తున్న ట్రాలి ఆటో బూర్గంపహాడ్ శివారులోని కిన్నెరసాని బ్రిడ్జి అప్రోచ్ రోడ్డుపై నుంచి అదుపుతప్పి వాగులోకి దూసుకుపోయింది.. ఈ ప్రమాద సమయంలో ఆటోలో 12 మంది ప్రయాణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.. అతి వేగం వల్లే మలుపు వద్ద వాహనాన్ని డ్రైవర్ కంట్రోల్ చెయ్యలేక పోవడంతో ఆటో లోయలో పడిందని పోలీసుల ప్రధాన దర్యాప్తు లో తేలింది.. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురికి తీవ్ర గాయాలు అవ్వగా జట్ల దుర్గారావు, పచ్చి సాని శ్రీనివాసరావు ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. ఇంకా దుర్గారావు ఇద్దరు కుమారులు సందీప్, ప్రదీప్ భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు..
ఈ ఘటన పై వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.. స్థానికుల సాయంతో మృతదేహలను బయటకు తీశారు.. క్షతగాత్రులను వెంటనే సమీప ప్రభుత్వాసుపత్రికి తరలించారు..ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.. దైవ దర్శనానికి వెళ్లి దేవుడి దగ్గరకే వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.. ఒకే గ్రామానికి చెందిన ఆరుగురు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయాలు అలుముకున్నాయి.. ఈ ఘటనతో ఒక్కసారిగా గ్రామం ఉలిక్కి పడింది.. ఇక ఈ ఘటన పై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది..