Road Accident: నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. నార్కట్ పల్లి మండలం ఏపీ లింగోటం శివారులో రహదారిపై చెట్లకు నీళ్లు పోస్తున్న వాటర్ ట్యాంకర్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. బస్సులో ప్రయాణిస్తున్న 20 మందికి గాయాలయ్యాయి. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Read Also: Karnataka: ప్రభుత్వ బస్సుల్లో మహిళకు ఉచిత ప్రయాణం.. కండక్టర్‌గా మారనున్న సీఎం
కోదాడ డిపోకు చెందిన బస్సు.. హైదరాబాద్ నుంచి కోదాడ వైపు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 43 మంది ప్రయాణికులున్నారు. ప్రమాద ఘటనతో హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారిపై మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది.