Tamilnadu: తమిళనాడు వేలురూ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది..వాలజా సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న కంటైనర్ ఓ కారు వేగంగా వచ్చి ఢీ కొట్టింది..ఈ ప్రమాదంలో ముగ్గురు స్పాట్ లోనే చనిపోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.. గాయపడిన ముగ్గురు చిన్నారులను ఆసుపత్రికి తరలించారు..
చెన్నై లోని అడయారు ప్రాంతంలోని రామాపురానికి చెందిన తిరుమాల్. ఇతని భార్య అష్టలక్ష్మి. వీరికి తరణ్, తరుణిక, తనుష్క ముగ్గురు పిల్లలు. పడమర అన్నానగర్‌కు చెందిన తిరుమాల్ అక్క ఎయులరసి వీరందరూ కలిసి ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో రెండు రోజుల క్రితం వేలూరు జిల్లా విరింజిపురంలోని బంధువుల ఇంటికి వెళ్లారు..
తిరుమాల్ అక్క ఎయులరసితో పాటు ముగ్గురు పిల్లలు కలిసి కారులో చైన్నెకి బయలుదేరారు. కారు రాణిపేట జిల్లా వాలాజ సమీపంలోని దేవానం బైపాస్ వద్ద వెళుతుండగా రోడ్డు పక్కన ఆగి ఉన్న కంటైనర్ లారీని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో తిరుమాల్, ఎయులరసి, కారు డ్రైవర్ అయ్యప్పన్ మృతిచెందారు.. ఇక ముగ్గురు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు.. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు గుర్తించారు..