హనుమకొండ జిల్లా కాజీపేటలో దారుణం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన బైక్ ఎక్కుతున్న ఓ మహిళని అతి వేగంతో వచ్చిన కారు ఢీకొట్టింది. అప్పుడే కాజీపేట సెయింట్ గ్యాబ్రియల్ స్కూల్ నుండి బయటికి వచ్చి బైక్ ఎక్కుతున్న క్రమంలో కవిత అనే మహిళను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
8 Killed in Odisha Road Accident: ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కెందుజార్లో శుక్రవారం ఉదయం 5 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా.. 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. 20వ నంబర్ జాతీయ రహదారి బలిజోడి సమీపంలో ఆగి ఉన్న ట్రక్కును వేగంగా దూసుకొచ్చిన వ్యాన్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వ్యాన్ డ్రైవర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.…
Mohammed Shami Rescues Person in Nainital: భారత సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ తనలోని మానవత్వంను మరోసారి చాటుకున్నాడు. కరోనా వైరస్ మహమ్మారి సమయంలో ప్రజలకు సాయం చేసిన షమీ.. తాజాగా ఉత్తరాఖండ్లోని నైనిటాల్ పట్టణానికి సమీపంలో ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడాడు. తమ ముందు వెళ్తున్న ఓ కారు కింద పడిపోవడం గమనించిన షమీ.. వెంటనే తన కారు ఆపి అతడిని రక్షించాడు. కారు ప్రమాదానికి సంబందించిన ఒక వీడియోను ఇన్స్టాగ్రామ్లో భారత పేసర్…
Rajasthan: రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రధాని నరేంద్రమోడీ ర్యాలీ కోసం వీఐపీ డ్యూటీ కోసం వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో ఆరుగురు పోలీసులు మృతి చెందారు. ఒకరు తీవ్రగాయాలపాలయ్యారు. ఈ ప్రమాదం ఆదివారం రోజున చురు జిల్లాలోని సుజన్గఢ్ సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కనోటా పోలీస్ పోస్ట్ ఏరియాలో పోలీస్ సిబ్బందితో వెళ్తున్న వాహనం ట్రక్కును ఢీకొట్టింది. వీరంతా ఝంజులో జరిగే ప్రధాన మంత్రి ర్యాలీ కోసం డ్యూటీ చేసేందుకు వెళ్తున్నారు.
మెదక్ జిల్లాలో పండగ పూట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు పిల్లలతో స్కూటీపై వెళ్తున్న తల్లిని టిప్పర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు కుమారులు మృతి చెందారు. తల్లి స్వల్ప గాయాలతో బయటపడింది.
3 Killed in Anantapur Road Accident: అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న వారిపై ఓ బొలెరో క్యాంపర్ వాహనం దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో ఐదుగురికి గాయాలు కాగా.. వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఆత్మకూరు మండలం పంపనూరు గ్రామం వద్ద బొలెరో క్యాంపర్ వాహనం బీభత్సం సృష్టించింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న…
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు ప్రైవేటు బస్సులు ఢీ కొట్టుకోవడంతో నలుగురు మరణించారు. ఇక, ఈ ప్రమాదంలో 60 మందికి గాయాలు అయ్యాయి.
3 Killed and 6 Injured In Multi-Car Crash At Mumbai: ముంబైలోని బాంద్రాలో ఓ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన కారు.. అదుపుతప్పి పలు వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గురువారం రాత్రి 10:15 గంటల ప్రాంతంలో వర్లీ నుంచి బాంద్రా వైపు…