ఒకరు చేసిన ప్రమాదానికి మరొకరి ప్రాణాలు పోతున్నాయి. డ్రైవింగ్ సరిగ్గా నేర్చుకోక.. కారు, బైక్ ఉంది కదా అని రోడ్లపైకి వచ్చి అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. ఈ ప్రమాదాల వల్ల ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ.. అబ్బే అస్సలు పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా యువత అడ్డగోలుగా రోడ్లపైకి వచ్చి ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ మనుషుల పాలిట యములుగా మారుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే హనుమకొండ జిల్లాలో చోటు చేసుకుంది.
Caste Boycott: ఎంత అమానుషం!.. తిరునాళ్లకు చందాలు ఇవ్వలేదని కుల బహిష్కరణ
వివరాల్లోకి వెళ్తే.. హనుమకొండ జిల్లా కాజీపేటలో దారుణం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన బైక్ ఎక్కుతున్న ఓ మహిళని అతి వేగంతో వచ్చిన కారు ఢీకొట్టింది. అప్పుడే కాజీపేట సెయింట్ గ్యాబ్రియల్ స్కూల్ నుండి బయటికి వచ్చి బైక్ ఎక్కుతున్న క్రమంలో కవిత అనే మహిళను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మరోవైపు ఢీకొట్టిన కారు నెంబర్ TS03 FA9881గా గుర్తించారు.
కాగా.. ప్రమాదం చేసిన వ్యక్తి ఓ ఉన్నతాధికారి కొడుకుగా గుర్తించారు. ఈ ప్రమాదం సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. మరోవైపు.. ఈ ప్రమాదంపై నిన్నటినుండి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్న తమకు న్యాయం చేయడం లేదని మృతురాలి బంధువులు ఆందోళన చేపట్టారు. ఓ ఉన్నత అధికారి కొడుకుని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని ఫాతిమా నగర్ జంక్షన్ లో ధర్నా చేపట్టారు. ఈ క్రమంలో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రస్తుతం డెడ్ బాడీ మృతురాలి ఇంటి దగ్గర ఉంది.. బాధితురాలు కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో ఆందోళన చేస్తున్నారు.