పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్యాసింజర్ వ్యాన్, ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మహిళలు, చిన్నారులు సహా ఒకే కుటుంబానికి చెందిన 13 మంది మృతి చెందారు. మరో తొమ్మిది మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. లాహోర్‌కు 350 కిలోమీటర్ల దూరంలోని ముజఫర్‌గఢ్ జిల్లాలో ఆదివారం ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఎమర్జెన్సీ సర్వీస్ 1122 ప్రకారం.. ప్యాసింజర్ వ్యాన్, ట్రక్కు ఢీకొనడంతో చాలా మంది అక్కడికక్కడే మరణించారు. అధికారులు తెలిపిన…
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కోడూరుపాడు హెచ్ పీ పెట్రోల్ బంక్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు అదుపు తప్పి లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. సంఘటన ప్రదేశంలోనే నలుగురు దుర్మరణం చెందారు. మరో వ్యక్తి తీవ్రగాయాలు అయ్యాయి.
తిరుపతి జిల్లాలోని చంద్రగిరిలో ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కొంగరవారి పల్లి దగ్గర ఓ కారు అదుపు తప్పి కల్వర్ట్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సంఘటన ప్రదేశంలోనే నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో స్థానిక హస్పటల్ కు తరలించారు.
కొత్వాలి సెక్టార్-24 ప్రాంతంలో ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. కంచన్‌జంగా మార్కెట్ సమీపంలో వేగంగా వస్తున్న ఆడి కారు ఢీకొనడంతో వృద్ధుడు మృతి చెందాడు. కారు వేగంగా వచ్చి వృద్ధుడిని ఢీకొట్టడంతో.. కాసేపు గాలిలో ఉండి పది మీటర్ల దూరంలో పడిపోయాడు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఈ ప్రమాదంపై మృతుడి కుమారుడు గుర్తు తెలియని డ్రైవర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రమాదానికి గురైన బాధితుడిని తన ఎస్కార్ట్ కారులో ఆసుపత్రికి తరలించారు. వరంగల్ లేబర్ కాలనీ వద్ద అంజయ్య అనే వ్యక్తి ప్రమాదానికి గురై రోడ్డుపై పడిపోయాడు.
ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. లో కార్మికుల పికప్ వాహనం బోల్తా పడి 15 మంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
రోడ్డు ప్రమాదాల గురించి పోలీసులు ఎన్ని నివారణ చర్యలు చేపట్టినప్పటికీ.. ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు. అతి వేగం మనుషుల ప్రాణాలను బలికొంటుంది. ఈ క్రమంలో.. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన బైక్ చెట్టును ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ మేరకు ఆదివారం పోలీసులు సమాచారం అందించారు. శనివారం రాత్రి లైలుంగా పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్రహన్ గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు.
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కనిగిరి నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందగా.. 10 మందికి గాయాలయ్యాయి.
Prakasam Road Accident: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దోర్నాల మండలం చిన్నారుట్ల చెంచుగూడెంలో సమీపంలో బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది.. క్షతగాత్రులను సున్నిపెంట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ వైద్యులు గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులను కర్నూలు జిల్లా కోడుమూరు మండలం పేలకుర్తి గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. 25 మంది భక్తులు బుధవారం…