పశ్చిమ బెంగాల్‌లోని పురూలియా జిల్లాలోని రాష్ట్ర రహదారిపై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పలు వాహనాలను ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో కనీసం ఐదుగురు మరణించగా, మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పురూలియా ఎస్పీ అవిజిత్ బెనర్జీ తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్డు నిర్మాణం కోసం కాంక్రీట్‌ను తీసుకెళ్తున్న ట్రక్కు మొదట ఓ బైక్‌ను ఢీకొట్టగా.. బైకిస్ట్ అక్కడికక్కడే మృతి చెందాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారన్నారు.
Road Accident : పిలిభిత్‌లో శుక్రవారం తెల్లవారుజామున మొరాదాబాద్ నుండి డిసిఎం మీదుగా లఖింపూర్ ఖేరీకి వెళ్తున్న కార్మికులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అస్సాం హైవేపై బిజ్నోర్ గ్రామ సమీపంలో డీసీఎం డ్రైవర్ నిద్రపోయాడు.
మహిళలు తలచుకుంటే ఏదైనా చేయగలరని మరోసారి నిరుపించింది కేరళ కి చెందిన షీజా. తన కుటుంబాన్ని పోషించుకునేందుకు సాహసానికి ఒడిగట్టింది. పదుల అడుగుల ఎత్తున్న తాటి చెట్టు ఎక్కి కల్లు తీస్తోంది.
Road Accident : రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సికార్ నుంచి త్రినేత్ర గణేష్ ఆలయానికి వెళ్తుండగా రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లోని బనాస్ కల్వర్టు సమీపంలో ఈరోజు ఉదయం జరిగిన ప్రమాదంలో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతి చెందారు.
కెనడా పర్యటనకు వెళ్లిన భారతీయ దంపతులు.. వారి మూడు నెలల మనవడు సహా నలుగురు వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో మరణించారు. మద్యం మత్తులో రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేస్తున్న క్రమంలో.. ఈ ప్రమాదం జరిగిందని అక్కడి పోలీసులు చెబుతున్నారు. టొరంటోకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న విట్బీలోని హైవే 401లో నలుగురు వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో మరణించారని అంటారియో పోలీసులు గురువారం తెలిపారు.
Suresh Raina Cousin Dead in Road Accident: టీమిండియా మాజీ బ్యాటర్, ‘మిస్టర్ ఐపీఎల్’ సురేశ్ రైనా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. రైనా కజిన్ సౌరభ్ కుమార్ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఈ ప్రమాదంలో సౌరభ్ స్నేహితుడు కూడా మృతి చెందాడు. ఈ ఘటన మే 1న హిమాచల్ ప్రదేశ్ కాంగ్రా జిల్లాలోని గగల్ ఎయిర్ పోర్ట్ సమీపంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేపట్టారు. రైనా తల్లి…
మామిడికుదురు మండలం నగరం గ్రామానికి చెందిన కొమ్మాబత్తుల జతిన్ పుట్టినరోజు సందర్భంగా.. ఎనిమిది మంది యువకులు యానం వెళ్లారు.. ఆదివారం రాత్రి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు.. అర్ధరాత్రి వరకు యానాంలో ఫుల్లుగా మద్యం సేవించి.. ఆ తర్వాత ఆటోలో సొంత ఊరికి బయల్దేరారు.. అయితే, రాత్రి 12.30 గంటల సమయంలో అమలాపురం మండలం భట్నవిల్లిలో లారీని ఢీకొట్టింది ఆటో.. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు యువకులు ప్రమాద స్థలంలోనే ప్రాణాలు వదిలారు.
Road Accident : ఛత్తీస్‌గఢ్‌లోని బెమెతరలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కతియాలో ఆగి ఉన్న మజ్దా కారును వెనుక నుంచి పికప్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం చెందారు.
ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ బస్సు-ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో 15 మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం సఫీపూర్ కొత్వాలి ప్రాంతంలోని జమాల్దీపూర్ గ్రామ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. ప్రయాణికులతో బంగార్మావు వైపు వెళ్తున్న ప్రైవేట్ బస్సును ముందు నుంచి వస్తున్న ట్రక్కు ఢీకొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
Lok Sabha Election : గోపాల్‌గంజ్ నుంచి సుపాల్‌కు వెళ్తున్న భద్రతా బలగాలకు చెందిన మూడు బస్సులు ప్రమాదానికి గురయ్యాయి. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, కానిస్టేబుల్ మృతి చెందారు.