JDU: రబ్రీదేవికి సంతకం పెట్టడం రాదు, ఆమె కూడా బడ్జెట్‌పై మాట్లాడుతోంది..
- కేంద్ర బడ్జెట్‌లో బీహార్‌కి ఏమీ ఇవ్వలేదన్న రబ్రీదేవి..
- ఆమెకు సంతకం కూడా పెట్టరాదు.. బడ్జెట్‌పై మాట్లాడుతోంది..
- జేడీయూ ఎదురుదాడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JDU: ఈ రోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ని ప్రవేశపెట్టారు. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఆర్జేడీడీ నేత, లాలూ ప్రసాద్ భార్య రబ్రీ దేవి విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలపై జేడీయూ ఎంపీ లల్లన్ సింగ్ ఫైరయ్యారు. బడ్జెట్‌లో సామాన్యులకు ఏమీ లేదని, కేంద్రం బీహార్‌కి బొమ్మ(జుంఝానా) మాత్రమే ఇచ్చిందని ఆమె అన్నారు. ఈ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ బీజేపీ మిత్రపక్షం జేడీయూ విమర్శలు గుప్పిస్తోంది.
ఆమె వ్యాఖ్యలపై జేడీయూ ఎంపీ లల్లన్ సింగ్ మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి(రబ్రీ దేవీ)కి సంతకం ఎలా చేయాలో కూడా తెలియదని, ఆమె బడ్జెట్‌పై ఎలా మాట్లాడుతుంది..? అని ఎద్దేవా చేశారు. బీహార్‌కు రూ.26,000 కోట్లు కేటాయించడం సాధారణ ప్రజల కోసం కాదని, కార్పొరేట్ రంగానికి ఉద్దేశించిన బడ్జెట్‌పై కేంద్ర ప్రభుత్వాన్ని ఆర్జేడీ విమర్శించింది. ఈ బడ్జెట్ కార్పొరేట్ రంగానికి మాత్రమే అని విమర్శించింది.
Also Read
Read Also: Ratan Tata: ఒక్క ప్రకటనతో రూ.19 వేల కోట్లు రాబట్టిన రతన్ టాటా..ఆ ప్రకటన ఇదే…
‘‘ ఈ బడ్జెట్ కేవలం కార్పొరేట్ రంగానికి మాత్రమే. కేంద్రం నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఎలా కల్పించాలో కేంద్ర ఆర్థిక మంత్రికి ఎలాంటి ఆలోచన లేదు. ఆమె తన బడ్జెట్ ప్రసంగంలో యువత, రైతులు, మహిళలు, కార్మికుల సమస్యలను ప్రస్తావించలేదు’’ అని ఆర్జేడీ ఎమ్మెల్యే భాయ్ వీరేంద్ర అన్నారు. బీహార్‌కి ప్రత్యేక హోదా అవసరమని, కేంద్రం దాన్ని తిరస్కరించిందని చెప్పారు.
ఇదిలా ఉంటే ఈ బడ్జెట్‌లో బీహార్ రాష్ట్రానికి పెద్దపీట వేశారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం రూ.26,000 కోట్లు కేటాయించారు. ఈ బడ్జెట్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ద్వారా బీహార్ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తుందని బీజేపీ ఎమ్మెల్యే ప్రమోద్ కుమార్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం బీహార్‌కి మూడు ఎక్స్‌ప్రెస్ వే ప్రాజెక్టులను కేటాయించింది.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!