Bihar: బీహార్‌లో కుంగిన వంతెన..20 రోజల్లో ఆరో ఘటన..
- బీహార్‌లో కుంగిన వంతెన..
- 20 రోజుల్లో ఆరో ఘటన..
- వరసగా రాష్ట్రం కుప్పకూలుతున్న వంతెనలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar: బీహార్‌లో వరసగా వంతెనలను ప్రమాదానికి గురవుతున్నాయి. రోజుల వ్యవధిలో వంతెనలు కూలిపోవడమో, కుంగిపోవడం జరుగుతోంది. తాజాగా మరో వంతెన ఆదివారం కుంగిపోయింది. 20 రోజుల్లో ఇది ఆరో ఘటన. భారీ వర్షాల తర్వాత బండ్ నది నీటిమట్ట పెరగడంతో ఠాకూర్‌గంజ్ బ్లాక్‌లోని వంతెన ఈ రోజు కొన్ని అడుగుల మేర కుంగిపోయింది. దీంతో వంతెన ఉపరితలంపై పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో వంతెన ప్రమాదకరంగా మారింది. పఠారియా పంచాయతీలోని ఖోషి డాంగి గ్రామంలో ఉన్న వంతెనను ఠాకూర్‌గంజ్‌లోని అప్పటి ఎంపీ ఎండీ తస్లీముద్దీన్ ఎంపీ నిధుల నుంచి 2007-2008లో నిర్మించారు. కానీ వంతెన నీటి ఒత్తిడిని తట్టుకోలేకపోయినట్లు తెలుస్తోంది. మూడు నాలుగు పంచాయతీలను కలుపుతున్న ఈ వంతెన కూలిపోతే 60 వేల మంది ప్రజలకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది.
Read Also: Araku Coffee: అరకు కాఫీపై ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు మధ్య ఆసక్తికర చర్చ
Also Read
- Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
- BRICS Summit 2026: పుతిన్-మోడీ-జిన్‌పింగ్.. ప్రపంచం చూపంతా ఢిల్లీ వైపే!
- Maharashtra: నాందేడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు-టాటా మ్యాజిక్ ఢీ.. 9 మంది మృతి
- IndiGo Flight: టిష్యూ పేపర్‌పై ‘బాంబు’ బెదిరింపు.. అహ్మదాబాద్‌లో ఇండిగో ఎమర్జెన్సీ ల్యాండింగ్
నిన్న మధుబని ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. బీహార్ ప్రభుత్వంలోని రూరల్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ రూ. 3 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న వంతెన కుప్పకూలింది. దీనికి ముందు అరారియా, సివాన్, తూర్పు చంపారన్ మరియు కిషన్‌గంజ్ ప్రాంతాల్లో వంతెనలు కూలాయి.
ఇటీవల బీహార్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వంతెనలు కూలిపోతున్నాయి. దీనిపై ప్రతిపక్షాలు ముఖ్యంగా ఆర్జేడీ పార్టీ అధికార జేడీయూ-బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది. కేంద్ర రాష్ట్రాలు బీహార్ ప్రజలకు ‘మంగళ్‌రాజ్’ అందించారని వంతెనల కూలిన ఘటనలపై ఆర్జేడీ నేత, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ విమర్శించారు. అయితే, ఈ బ్రిడ్జిలు కూలిపోతున్న ఘటనపై ఏదైనా కుట్ర ఉందా..? అనే అనుమానాన్ని కేంద్రమంత్రి జీతన్ రామ్ మాంఝీ వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత నుంచే ఎందుకు కూలడం ప్రారంభమయ్యాయని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం పరువు తీసేందుకు ఏదైనా కుట్ర చేస్తున్నారా.? అని అన్నారు.
- Tags
- bihar
- Bihar Bridge Collapse
- bjp
- JDU
- RJD
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?