Kolkata Doctor Case: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన కోల్‌కతా ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య కేసులో సీబీఐ విచారణలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. డాక్టర్‌పై సామూహిక అత్యాచార ఆరోపణల్ని సీబీఐ కొట్టిపారేసింది. సంజయ్ రాయ్ అనే నిందితుడు వైద్యురాలిపై అత్యాచారం చేసి, హత్య చేసినట్లు సీబీఐ తన ఛార్జిషీట్‌లో పేర్కొంది. రెండు నెలల విచారణ తర్వాత సీబీఐ ఈ రోజు మధ్యాహ్నం సీల్దా అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ…
Supreme Court: కోల్‌కతా వైద్యురాలి ఘటనపై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ తీరుపై ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మహిళా వైద్యులకు రాత్రి షిఫ్టులు కేటాయించడాన్ని నిరాకరిస్తున్నామని ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ని సీజేఐ విమర్శించారు. వారికి భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్రప్రభుత్వానిది అని అన్నారు.
అత్యాచారం, హత్య కేసుల్లో బాధితుల గుర్తింపును వెల్లడించలేమని, వికీపీడియా తప్పనిసరిగా అలాంటి సూచనలను తొలగించాలని, భారత చట్టంలోని నిబంధనలు చాలా స్పష్టంగా ఉన్నాయని ప్రధాన న్యాయమూర్తి అన్నారు. ఘటన తర్వాత బాధితురాలి ఫోటోలో ఆన్‌లైన్‌లో షేర్ చేయబడ్డాయి. ట్రైనీ డాక్టర్ పేరు, ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా నుంచి ఇంతకుముందు కూడా తొలగించాలని కోర్టు ఆదేశించింది.
Abhishek Banerjee: కోల్‌కతాలో వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో 31 ఏళ్ల ట్రైనీ పీజీ వైద్యురాలిపై అత్యంత దారుణంగా హత్యాచారం జరిగింది. ఈ కేసుని సరిగా డీల్ చేయడంలో బెంగాల్ ప్రభుత్వం, పోలీసులు విఫలమైనట్లు కలకత్తా హైకోర్టు చీవాట్లు పెట్టింది. కేసుని సీబీఐకి అప్పగించింది. ఈ కేసులో సంజయ్ రాయ్ అనే వ్యక్తిని ప్రధాన నిందితుడిగా అరెస్ట్ చేశారు.
Kolkata Doctor Case: కోల్‌కతా ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలకు కేంద్రంగా మారింది. 31 ఏళ్ల ట్రైనీ పీజీ వైద్యురాలు నైట్ డ్యూటీలో ఉన్న సమయంలో దారుణంగా అత్యాచారం చేసి, హత్య చేశారు. ఈ ఘటనలో సంజయ్ రాయ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై దేశంలోని అన్ని ప్రాంతాల్లో వైద్యులు తీవ్ర నిరసన తెలియజేశారు.
Kolkata doctor case: కోల్‌కతా డాక్టర్ అత్యాచారం, హత్య కేసులో సీబీఐ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆర్ జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ సెమినార్ హాలులో 31 ఏళ్ల ట్రైనీ వైద్యురాలి మృతదేహం కనుగొన్న తర్వాత, ఘటన గురించి స్థానిక పోలీసులకు తెలియజేయడంలో జాప్యం చేసినట్లు సీబీఐ కనుగొంది.