నీట్ పేపర్ లీక్ కేసు సూత్రధారి సంజీవ్ ముఖియా ఎట్టకేలకు అరెస్టు అయ్యాడు. నీట్ పేపర్ లీక్ పై ప్రాథమిక దర్యాప్తు జరుపుతున్న బీహార్ ఆర్థిక నేరాల విభాగం (EOU).. గురువారం రాత్రి పాట్నాలోని సగుణ మోడ్ ప్రాంతానికి చెందిన సంజీవ్ ముఖియాను అరెస్టు చేసింది. ఈ ఆపరేషన్‌లో దానాపూర్ పోలీసులు కూడా ఈఓయూకి సహకరించారు. సంజీవ్ ముఖియా చాలా కాలంగా పరారీలో ఉన్నాడు. సీబీఐ కూడా అతని కోసం వెతుకుతోంది.
కాకాణి ఆచూకీ చెబితే బహుమతి ఇస్తాను అంటూ బంపరాఫర్ ఇచ్చారు మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎక్కడున్నాడో తెలియడం లేదు.. నేను ఆఫర్ ఇస్తున్నాను.. వైసీపీ వాళ్లు కానీ ఎవరైనా కావచ్చు ఆయన ఆచూకీ తెలిపితే కాకాణి ఇంటి పక్కన ఉన్న కరోనా హౌస్ ను బహుమతిగా ఇద్దామని ఆలోచిస్తున్నా అని ప్రకటించారు.. అందరూ ముందుకు రండి.. కాకాణి ఆచూకీ తెలపాలని కోరారు..
గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ను ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులకు క్షత్రియ కర్ణి సేన అధ్యక్షుడు రాజ్ షెకావత్ రివార్డ్ ప్రకటించడంతో కలకలం మొదలైంది. ఇదిలా ఉండగా.. లారెన్స్ ను ఎన్‌కౌంటర్ చేసినందుకు రివార్డ్ ప్రకటించడంతో ఆగ్రహించిన ప్రజలు కర్ణి సేన అధ్యక్షుడు రాజ్ షెకావత్‌పై దాడి చేశారని సోషల్ మీడియాలో దీనికి చెందిన ఓ వీడియో వైరల్ గా మారింది.
కోయంబత్తూర్‌లోని బోచే ఫుడ్ ఎక్స్‌ప్రెస్ రైలు రెస్టారెంట్ బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్ నిర్వహించింది. ఈ ఛాలెంజ్లో బుధవారం వందలాది మంది పాల్గొన్నారు. అయితే.. ఈ ఛాలెంజ్ ఎలా ఉందంటే.. 30 నిమిషాల్లో 6 ప్లేట్ల బిర్యానీ తినాలి. అలా తిన్న వారికి లక్ష రూపాయల బహుమతిని గెలుచుకోవచ్చని ఆ రెస్టారెంట్ ప్రకటించింది.
ఆఫ్గానిస్థాన్ క్రికెటర్ రషీద్ ఖాన్‌కు రూ.10 కోట్లు ఇవ్వాలని నిర్ణయించుకున్న విషయంపై రతన్ టాటా స్పందించారు. అదంతా సోషల్ మీడియాలో జరుగుతున్న ఫేక్ న్యూస్ అని ఆయన చెప్పుకొచ్చారు. ఏ ఆటగాడికి సంబంధించిన సలహాలు లేదా ఫిర్యాదుల విషయంలో నేను ఐసీసీకి ఎలాంటి సలహా ఇవ్వలేదని రతన్ టాటా తన ట్వీట్‌లో రాశారు.
మోస్ట్ వాంటెడ్ ఐసిస్ ఉగ్రవాదిని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్టు చేశారు. ఉగ్రవాది మహ్మద్ షానవాజ్ అలియాస్ షఫీగా గుర్తించారు. ఈ ఉగ్రవాది జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నాడు. ఇతనితో పాటు మరో ఇద్దరు ఇస్లామిక్ స్టేట్ అనుమానిత ఉగ్రవాదులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మే 5న విడుదలవుతున్న 'ది కేరళ స్టోరీ' చిత్రానికి వ్యతిరేకంగా కేరళలో నిరసనలు తీవ్రమవుతున్నాయి. సీపీఐ(ఎం), కాంగ్రెస్‌కు చెందిన సీనియర్ నాయకులు ఈ చిత్రాన్ని "ప్రచార చిత్రం" అని తీవ్రంగా విమర్శించారు.సోమవారం 'ది కేరళ స్టోరీ' మద్దతుదారులకు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) యువజన విభాగం అయిన ముస్లిం యూత్ లీగ్ ఒక సవాల్‌ను విసిరింది.
గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం గురించి సమాచారం ఇస్తే రూ.25 లక్షలు రివార్డుగా ఇస్తామని ప్రకటించింది జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ).. 1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో కీలక నిందితుడు, పరారీలో ఉన్న అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అరెస్టుకు దారితీసే ఏదైనా సమాచారం ఇస్తే 25 లక్షల రూపాయల నగదు బహుమతి ఇవ్వనున్నట్టు జాతీయ దర్యాప్తు సంస్థ ప్రకటించింది. ఇక, ఇబ్రహీం సన్నిహితుడు షకీల్ షేక్ అలియాస్ ఛోటా షకీల్‌పై రూ. 20 లక్షలు, సహచరులు హాజీ…
కొన్ని విచిత్రమైన పోటీలు ఉంటాయి.. వాటి వెనుక పబ్లిసిటీ స్టంటే ఉంటుంది.. తాజాగా, ఓ స్వీట్ షాపు నిర్వహకుడు ఓ భారీ సమోసా తయారు చేయించాడు.. దానికి సైజుకు తగ్గట్టుగానే ‘బాహుబలి’గా నామకరణం చేశాడు.. ఇక, ఆ సమోసా తిన్నవారికి రూ.51 వేల బహుమతి ప్రకటించాడు.. అయితే, ఎక్కడైనా షరతులు ఉంటాయి కదా.. ఆ సమోసా తినడానికి కూడా కొంత టైం కేటాయించాడు.. అయితే, ఈ వార్త సోషల్ మీడియాకు ఎక్కి రచ్చ చేస్తోంది.. ఈ దెబ్బతను…