నీట్ పేపర్ లీక్ కేసు సూత్రధారి సంజీవ్ ముఖియా ఎట్టకేలకు అరెస్టు అయ్యాడు. నీట్ పేపర్ లీక్ పై ప్రాథమిక దర్యాప్తు జరుపుతున్న బీహార్ ఆర్థిక నేరాల విభాగం (EOU).. గురువారం రాత్రి పాట్నాలోని సగుణ మోడ్ ప్రాంతానికి చెందిన సంజీవ్ ముఖియాను అరెస్టు చేసింది. ఈ ఆపరేషన్‌లో దానాపూర్ పోలీసులు కూడా ఈఓయూకి సహకరించారు. సంజీవ్ ముఖియా చాలా కాలంగా పరారీలో ఉన్నాడు. సీబీఐ కూడా అతని కోసం వెతుకుతోంది.
READ MORE: Pahalgam Terror Attack: మృతుల కుటుంబాలకు ఎన్‌ఎస్‌ఈ, ఎల్‌ఐసీ బాసట.. పరహారం ప్రకటన
ఇటీవల, బీహార్ పోలీసు ప్రధాన కార్యాలయం సంజీవ్ ముఖియాను పట్టించిన వారికి రూ. 3 లక్షల రివార్డును ప్రకటించింది. ఈ రివార్డును 2025 ఏప్రిల్ 10న ప్రకటించారు. అతని గురించి ఏమైనా తెలిస్తే సమాచారం ఇవ్వమని విజ్ఞప్తి చేశారు. నీట్ పేపర్ లీకేజీతో పాటు, బీహార్‌లో టీచర్ రిక్రూట్‌మెంట్, కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్ష వంటి అనేక పేపర్ లీక్ కేసుల్లో సంజీవ్ ముఖియా ప్రమేయం ఉందని ఆరోపణలు ఉన్నాయి.
READ MORE: Jammu Kashmir: జమ్మూ కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. లష్కరే తోయిబా ఆగ్ర ఉగ్రవాది ఖతం..
దానాపూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని సగుణ మోడ్‌లో ఉన్న ఒక అపార్ట్‌మెంట్‌కు సంజీవ్ ముఖియా వస్తున్నాడని బీహార్ ఆర్థిక నేరాల విభాగానికి రహస్య సమాచారం అందింది. ఈ సమాచారం ఆధారంగా ఆ బృందం దాడికి ప్రణాళిక వేసింది. గురువారం రాత్రి ఆపరేషన్ ప్రారంభించి సంజీవ్ ముఖియాను అరెస్టు చేసింది. ఈ ఆపరేషన్‌లో నిందితుడు తప్పించుకోకుండా ఉండటానికి దానాపూర్ పోలీసుల సహాయంతో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు.
READ MORE: Pahalgam Terror Attack: పహల్గామ్‌పై న్యూయార్క్ టైమ్స్ తప్పుడు కథనం.. తీవ్రంగా తప్పుపట్టిన అమెరికా
గత ఏడాది నీట్ పేపర్ లీక్..
నీట్ పేపర్ లీక్ కేసు మే 5, 2024న పాట్నా పోలీసులు అక్రమాలను వెల్లడించడంతో వెలుగులోకి వచ్చింది. మొదట్లో బీహార్ ఆర్థిక నేరాల విభాగం దీనిపై దర్యాప్తు ప్రారంభించింది. కానీ తరువాత 23 జూన్ 2024న కేసును సీబీఐకి అప్పగించారు. సీబీఐ తన దర్యాప్తులో సంజీవ్ ముఖియాను ప్రధాన నిందితుడిగా పరిగణించింది. కానీ.. నిందితుడు మాత్రం చాలా కాలంగా పరారీలో ఉన్నాడు. తాజాగా అతని అరెస్టుతో రాష్ట్రంలో పేపర్ లీక్ కేసులోని అనేక అంశాలు బయటపడవచ్చు.