Lawrence Bishnoi: లారెన్స్ బిష్ణోయ్‌ని ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేసిన వ్యక్తిపై దాడి?(వీడియో)
- లారెన్స్ బిష్ణోయ్‌ను ఎన్‌కౌంటర్ చేసిన వారికి రూ. కోటి రివార్డ్
- రివార్డ్ ప్రకటించి క్షత్రియ కర్ణిసేన అధ్యక్షుడు రాజ్ షెకావత్‌పై దాడి?
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
- వీడియోలో నిజమెంత?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ను ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులకు క్షత్రియ కర్ణి సేన అధ్యక్షుడు రాజ్ షెకావత్ రివార్డ్ ప్రకటించడంతో కలకలం మొదలైంది. ఇదిలా ఉండగా.. లారెన్స్ ను ఎన్‌కౌంటర్ చేసినందుకు రివార్డ్ ప్రకటించడంతో ఆగ్రహించిన ప్రజలు కర్ణి సేన అధ్యక్షుడు రాజ్ షెకావత్‌పై దాడి చేశారని సోషల్ మీడియాలో దీనికి చెందిన ఓ వీడియో వైరల్ గా మారింది. తాజాగా ఈ వైరల్ అవుతున్న వీడియోలో కొందరు వ్యక్తులు రాజ్ షెకావత్‌ను బలవంతంగా కారులోకి ఎక్కించటానికి ప్రయత్నిస్తున్నట్లు చూడవచ్చు. ఈ సమయంలో.. పెద్దపెద్దగా అరుస్తూ అతడిపై దాడి చేసేందుకు పలువురు యత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. వెనక నుంచి అతని తలపాగాను బలవంతం లాగడం వల్ల పడిపోయింది.
READ MORE: Drinker Hulchul: తాగుబోతు హల్‌చల్.. పీకలదాకా తాగి బస్సుపై నిద్రించిన మందుబాబు
Also Read
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
అయితే.. 2023లో రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగామేడీని కాల్చిచంపారు. ఆయనను తామే హత్య చేసినట్లు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. దీంతో రాజ్ షెకావత్ లారెన్స్‌ను చంపాలని పోలీసులకు రివార్డ్ ప్రకకటించారు. ‘‘లారెన్స్ బిష్ణోయ్‌ను ఎన్‌కౌంటర్ చేసిన ఏ పోలీసు అధికారికైనా వారి భద్రత, కుటుంబ భవిష్యత్తు కోసం రూ.కోటికి పైగా ఇస్తాం. ఈ గ్యాంగ్ ఎన్ని హత్యలకు పాల్పడుతున్నా కేంద్ర ప్రభుత్వం, గుజరాత్ అధికారులు వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. మా అధినేత సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడిని చంపిన వారిని వదిలేది లేదు’’ అని రాజ్ షెకావత్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరలైంది.
READ MORE:Waqf bill: ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధం.. వక్ఫ్ బిల్లుని ఆపేస్తాం.. ముస్లిం పర్సనల్ లా బోర్డ్ చీఫ్..
ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోకు సంబంధించిన ఓ జాతీయ మీడియా సంస్థ ఈ వీడియోకి సంబంధించిన సమాచారాన్ని అందించింది. ఈ వీడియో పాతదని.. రివార్డ్ గురించి రాజ్ షెకావత్ స్టేట్‌మెంట్ కంటే ముందు జరిగిన ఘటనకు సంబంధించినది తెలిపింది. గతంలో నిరసన చేసేందుకు బీజేపీ ప్రధాన కార్యాలయానికి వెళ్తున్న కర్ణి సేనకు చెందిన రాజ్ షెకావత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటిదని చెబుతున్నారు.
पगड़ी केवल राज शेखावत जी की नही बल्कि पूरे क्षत्रिय समाज की उतरी है.. इसका जवाब मिलेगा pic.twitter.com/dDGma3ilEg
— Dr Raj Shekhawat (@IAMRAJSHEKHAWAT) April 9, 2024
తాజావార్తలు
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
-
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
-
Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!