అల్లూరి సీతారామ రాజు జిల్లాలో మావోయిస్ట్ కీలక నేతను అరెస్ట్ చేశారు పోలీసులు. 124 కేసులో నిందితుడిగా ఉన్న, మావోయిస్టు పెదబయలు ఏరియా కమిటీ కార్యదర్శి రామకృష్ణ అలియాస్ అశోక్ అరెస్టు చేశారు పాడేరు పోలీసులు. 39 లక్షల రూపాయలు, ఒక 9mm pistol, బుల్లెట్స్, ఐదు డిటోనేటర్లు, ఒక మందు పాతర, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు విశాఖ రేంజ్ డిఐజి హరికృష్ణ ఎదుట లొంగిపోయారు 33 మంది మావోయిస్టు పార్టీ 27 మంది మిలీషియా, 60 మంది సభ్యులు. వీరిలోకీలక నేత శ్రీకాంత్ వున్నారు.
ఈ సందర్భంగా విశాఖ రేంజ్ డీఐజీ హరికృష్ణ మాట్లాడుతూ లొంగిపోయిన వారంతా కూడా పెదబయలు, కోరుకొండ ఏరియా కమిటీ సభ్యులే అన్నారు. ఈమధ్యకాలంలో మావోయిస్టుల ప్రభావం క్రమంగా తగ్గుతుంది. మావోయిస్టు ల విధానాలతో గిరిజనులు విభేదిస్తున్నారు. ఛత్తీస్ ఘడ్ నుంచి మావోయిస్టులు రావడం తగ్గింది. 30 మంది లోపు మావోయిస్టులు మాత్రమే ఉన్నారు.రా ధా కేసు NIA దర్యాప్తు చేస్తోంది. పెద్దబయలు ఏరియా కమిటీ ప్రాబల్యం తగ్గింది. అల్లూరి జిల్లాలో ఎలాంటి కమిటీలు లేవు. అల్లూరి జిల్లా ఎస్పీ సతీష్ మాట్లాడుతూ.. పార్టీ సభ్యులు అందరిపై రివార్డు ఉంది. ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి. లొంగిపోయిన మావోయిస్టులకు మంచి సదుపాయాలు అందుతున్నాయి.. గిరిజనుల్లో అంతర్మథనం స్టార్ట్ అయ్యిందన్నారు.
Breaking News : జూలై 1న టెట్ ఫలితాలు..