దేశంలో ట్రాఫిక్ ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకుంటున్నా ప్రజల్లో మార్పు రావడం లేదు. పెరుగుతున్న వాహనాలతో పార్కింగ్ సమస్య పెద్ద తలనొప్పిగా మారింది. దీంతో ఎక్కడ పడితే అక్కడ వాహనదారులు తమ వాహనాలను పార్కింగ్ చేస్తూ ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాంగ్ పార్కింగ్‌కు సంబంధించి త్వరలోనే చట్టం తీసుకురానున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. రాంగ్ పార్కింగ్ చేసిన వాహనం ఫొటోను పంపిన వ్యక్తికి సైతం రివార్డ్ ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. గురువారం ఢిల్లీలో…
అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో బంగారు పతకాలు సాధించిన తెలంగాణ బిడ్డలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌గా నిలిచిన నిఖత్ జరీన్, ISSF షూటింగ్ పోటీల్లో స్వర్ణ పతకం గెలుచుకున్న ఇషా సింగ్‌లకు ఒక్కొక్కరికి రూ.2 కోట్ల నగదు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అంతేకాకుండా ఇంటి స్థలాన్ని కూడా కేటాయిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. జూబ్లీహిల్స్ లేదా బంజారాహిల్స్‌లో ఇంటి స్థలం కేటాయిస్తామని తెలిపింది. కాగా ఇటీవల టర్కీ…