Rakul Preet Singh : ‘సైతాన్’ మూవీకి రివ్యూ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అజయ్ దేవగణ్, ఆర్ మాధవన్ మరియు జ్యోతిక కీలకపాత్రలు పోషించిన సైతాన్ చిత్రానికి క్రమంగా వసూళ్లు పెరుగుతున్నాయి. పాజిటివ్ టాక్ రావడంతో ఈ చిత్రం జోరు చూపిస్తోంది. దర్శకుడు వికాస్ బాహ్ల్ ఈ చిత్రాన్నిసూపర్ నేచులర్ హారర్ థ్రిల్లర్‌గా తెరక్కించారు.మార్చి 8న ఈ చిత్రం రిలీజ్ అయింది. సస్పెన్స్‌తో ఉత్కంఠభరితంగా ఈ మూవీ ఉందని ప్రశంసలు వస్తున్నాయి. తాజాగా సైతాన్ చిత్రాన్ని చూసిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో ఈ చిత్రంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు.సైతాన్ మూవీ కళ్లు తిప్పకుండా చూశానని రకుల్ తెలిపారు. సీట్లకు అతుక్కుపోయేలా చేసిందని ఆమె ట్వీట్ చేశారు. సైతాన్ టీమ్‍కు ఆమె అభినందనలు తెలిపారు.
“సైతాన్ సినిమా దిమ్మతిరేగేలా ఉంది. అద్భుతమైన నేరేటివ్.. మైమరిపించే పర్ఫార్మెన్సులు, అద్భుతమైన నటీనటులు అలా కళ్లు పక్కకు తిప్పకుండా సీటుకు అతుక్కుపోయా. అద్భుతం..అజయ్ దేవ్‍గణ్, జ్యోతిక, మాధవన్, కిడ్స్.. టీమ్ మొత్తానికి కాంగ్రాచులేషన్స్” అని రకుల్ ప్రీత్ సింగ్ ట్వీట్ చేశారు.సైతాన్ సినిమా మూడు రోజుల్లో భారత్‍లో రూ.50 కోట్ల మార్కును దాటేసింది. మూడో రోజైన ఆదివారం ఈ మూవీ రూ.20.50 కోట్ల వసూళ్లను సాధించింది. దీంతో ఇండియాలో ఈ చిత్రానికి మూడో రోజుల్లో రూ.54.89 కోట్ల నెట్ వసూళ్లు వచ్చాయి. ఇక విదేశాల్లో ఈ మూవీకి ఇప్పటి వరకు సుమారు రూ.15 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయని తెలుస్తోంది.సైతాన్ చిత్రంలో జానకీ బోదీవాలా మరియు అంగద్ రాజ్ కూడా కీలకపాత్రలు పోషించారు.ఈ చిత్రంలో అజయ్ దేవ్‍గన్, మాధవన్, జ్యోతిక, జానకి యాక్టింగ్ కు ప్రశంసలు దక్కుతున్నాయి. వారి పర్ఫార్మెన్స్ ఈ చిత్రానికి హైలైట్‍గా నిలిచింది.సైతాన్ మూవీ నిర్మాణంలోనూ అజయ్ దేవ్‍గన్, జ్యోతిక భాగస్వాములయ్యారు. వారితో పాటు కుమార్ మంగత్ పాఠక్ మరియు అభిషేక్ పాఠక్ కూడా నిర్మాతలుగా ఉన్నారు. ఈ మూవీకి అమిత్ త్రివేది సంగీతం అందించారు.
Also Read
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Biscuit Recipe: ఓవెన్ అవసరం లేదు.. కడాయితోనే బేకరీ స్టైల్ బిస్కెట్లు ఇంట్లోనే.. తయారీ విధానం చాలా ఈజీ!
- Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- First Time In Cricket History: క్రికెట్ హిస్టరీలోనే మొదటి సారి.. బాల్ సిక్స్ వెళ్లినా 5 రన్స్ మాత్రమే..
తాజావార్తలు
-
Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
-
Biscuit Recipe: ఓవెన్ అవసరం లేదు.. కడాయితోనే బేకరీ స్టైల్ బిస్కెట్లు ఇంట్లోనే.. తయారీ విధానం చాలా ఈజీ!
-
Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-
First Time In Cricket History: క్రికెట్ హిస్టరీలోనే మొదటి సారి.. బాల్ సిక్స్ వెళ్లినా 5 రన్స్ మాత్రమే..
-
2027 World Cup: ప్రపంచ కప్‌లో ఆడే టాప్ 6 ఆటగాళ్లు వీరే.. ఆకాశ్ చోప్రా అంచనా ఇలా..
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?