Ponguleti Srinivasa Reddy: నిర్మల్ జిల్లాలోని కుంటాల సభలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. భూములు ఉన్నవారికి రక్షణ కల్పించడమే భూ భారతి లక్ష్యం అన్నారు. నాలుగు పైలెట్ మండలాల్లో 13 వేల అప్లికేషన్లు వచ్చాయి.. సాధ్యమైనంత వరకు సమస్యలు అన్ని పరిష్కరిస్తాం.. ధరణి వల్ల ఇబ్బంది పడ్డారో అలాంటి సమస్య భూ భారతిలో ఉండదు.
రాష్ట్రంలో భూవివాదాలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా అడుగులు వేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇందుకోసం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోంది. కోర్టులకు వెళ్లకుండా సర్కార్ పరిధిలో పరిష్కరించే సమస్యలపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. ఇవాళ్టి నుంచి నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో సదస్సులు జరుగుతాయి.
ఏపీ ప్రభుత్వం మరో కొత్త పనికి శ్రీకారం చుట్టబోతుంది. ఇప్పటికే రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుండగా.. తాజాగా మరో కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. అందుకు సంబంధించిన సమాచాారాన్ని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో ఈనెల 15 నుంచి వచ్చే నెల 30వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఈ నెల 15వ తేదీన లాంఛనంగా రెవెన్యూ సదస్సులు ప్రారంభిస్తామని ఆయన చెప్పారు.
భూసమస్యల పరిష్కారంపై మరోసారి దృష్టి సారించింది తెలంగాణ ప్రభుత్వం.. వాటి పరిష్కారం కోసం ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని నిర్ణయించారు సీఎం కె. చంద్రశేఖర్ రావు.