KCR Birthday: నేడు 71వ ఏడాదిలోకి అడుగుపెడుతున్న కేసీఆర్కు పెద్దెతున్న రాజకీయ నాయకులు, ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆయనకు సోషల్ మీడియా వేదికాగా శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రం గజ్వేల్ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదినం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు.
Read Also: Fake Certificate: వ్యవసాయ శాఖలో నకిలీ సర్టిఫికేట్‌ల కలకలం
గజ్వేల్ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు… pic.twitter.com/OTtysLYlya
— Telangana CMO (@TelanganaCMO) February 17, 2025
మరోవైపు, విదేశాలలోనూ కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్‌బోర్న్, అడిలైడ్, బ్రిస్బెన్ నగరాల్లో బీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బర్త్‌డే వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. యూకేలోనూ ఎన్నారై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో లండన్‌లో కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించి కేక్ కట్ చేశారు. అలాగే, యుఎస్ఏలోని బీఆర్ఎస్ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో పలు రక్తదాన శిబిరాలు నిర్వహించి, కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు. ఈ వేడుకలు కేసీఆర్ ప్రజా సేవలు, ఆలోచనలను గమనించి, ఆయనకు ప్రేమను, గౌరవాన్ని తెలుపుతున్న అభిమానులు కార్యకర్తలు వేడుకలు జరుపుతున్నారు.