ఖమ్మం పర్యటనలో మంత్రి పువ్వాడ అజయ్‌ను టార్గెట్ చేశారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. ఈ మధ్య అక్కడ జరిగిన ఘటనల్లో మంత్రిపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే కాగా.. అజయ్‌పై సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు రేవంత్.. సీబీఐ విచారణకు నువ్వే లేఖ రాయి అంటూ పువ్వాడ అజయ్‌కు సవాల్ విసిరారు.. కాంగ్రెస్ పార్టీ నాయకులపై కేసులు పెట్టి రాక్షస ఆనందం పొందుతున్నారు.. అలాంటి సైకోకు వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల…
టి.పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర, సభలపై రేవంత్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందేకాగా.. వాటిపై స్పందించిన డీకే అరుణ.. జోగులాంబ సాక్షిగా ప్రమాణం చేద్దామా? అమ్మవారి ఎదుట బండి సంజయ్ పై చేసిన ఆరోపణలు నిరూపిస్తావా? అని చాలెంజ్ చేశారు. పాదయాత్రకు వస్తున్న స్పందనను చూసి పిచ్చి ప్రేలాపనలు చేస్తారా? అని మండిపడ్డ ఆమె.. టీఆర్ఎస్ –…
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ.. రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చగా మారింది.. ఈ సమావేశంపై అనేక విధాలుగా ప్రచారం సాగుతోంది.. అయితే, పీకే-కేసీఆర్ భేటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు టి.పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. గత మూడు రోజులుగా ఓ అలజడి నడుస్తోంది.. పీకే.. కాంగ్రెస్, టీఆర్ఎస్ను కలపడానికి వచ్చిండు అంటున్నారు.. జాతీయ స్థాయిలో తీసుకునే నిర్ణయానికి మేం ఏమి చెప్పలేమన్నారు.. కానీ, రాహుల్ గాంధీ… టీఆర్ఎస్ గుంపుతో చేరినోడు వద్దు, కేసీఆర్‌తో…
మరోసారి టీఆర్ఎస్ నేతలపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ విమర్శలు గుప్పించారు. వచ్చే నెలలో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ వరంగల్‌లో పర్యటన, సభ సందర్భంగా కాంగ్రెస్ నేతల సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మధు యాష్కీ మాట్లాడుతూ.. అగం అవుతున్న తెలంగాణను ఆదుకోవడం కోసమే రాహుల్ సభ అని ఆయన వెల్లడించారు. కేసీఆర్ ఏ వర్గంని మోసం చేశారో.. ఆ వర్గాలను ఏకం చేస్తామన్నారు. ఈ టీఆర్ఎస్ హౌలే…
రాష్ట్ర నేతల అనుభవం ముందు ఇంఛార్జ్ ఠాగూర్ తేలిపోతున్నారా? మాణిక్యం ఠాగూర్. తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ ఎంపీ. తెలంగాణ వరకు AICC రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్. రాష్ట్రానికి ఇంఛార్జ్‌గా వచ్చినప్పుడు ఠాగూర్ గురించి ఏదేదో అనుకున్నారు. కానీ.. పార్టీ నాయకులను ఆయన గాడిలో పెట్టలేకపోతున్నారని తెలియడానికి ఎంతో టైమ్ పట్టలేదు. ఇందుకు ఠాగూర్ అనుభవ రాహిత్యం.. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుల అనుభవం ముందు తేలిపోతున్నట్టు గాంధీభవన్ వర్గాల్లోనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కమాండింగ్ లేదు.. కంట్రోలింగ్ అంతకంటే…
తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి టీఆర్ఎస్ నేతలపై నిప్పులు చెరిగారు. ఖమ్మంలో కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెడితే చూస్తూ ఊరుకోమని ఆమె హెచ్చరించారు. 26న ఖమ్మం వెళ్తున్న అందరి సంగతి తెల్చుతానని ఆమె వెల్లడించారు. పువ్వాడ అజయ్ తన గోతి తాను తీసుకున్నారని, మంత్రిగా బర్తరఫ్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. కేటీఆర్..పువ్వాడ బిజినెస్ పార్టనర్లు అని, కేటీఆర్ అండతో పువ్వాడ రెచ్చిపోతున్నారని ఆమె మండిపడ్డారు. ఏసీపీ ఓవర్ యాక్షన్ ఎక్కువైందని, ఓ వైపు…
తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన రాహుల్ గాంధీ.. త్వరలోనే రెండు రోజుల పాటు రాష్ట్రంలోపర్యటించనున్నారు.. ఆయన పర్యటనలో వరంగల్ వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధం అవుతోంది కాంగ్రెస్ పార్టీ.. ఇక, రాహుల్ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టి.పీసీసీ.. ఏర్పాట్లపై దృష్టిసారించిది.. అందులో భాగంగా.. ఈ నెల 22న వరంగల్‌లో పర్యటించనున్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, స్టార్ కంపెయినర్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ మరియు ముఖ్య…
బండి సంజయ్ పాదయాత్ర ఇక్కడ చేసుడు కాదు ఢిల్లీ యాత్ర పెట్టి తెలంగాణ కు రావాల్సిన నిధులు తెప్పించు అని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ బండి సంజయ్‌కు సవాల్ విసిరారు. సీఎం కేసీఆర్‌కు రైతు కృతజ్ఞత సభను సోమవారం చెన్నూరులో నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న బాల్క సుమన్ మాట్లాడుతూ.. బీజేపీ లీడర్ల కొడుకులు ఏసీ ల్లో ఉంటారు.. సాధారణ బీజేపీ కార్యకర్తలు వారి కొడుకులు లొల్లి పెట్టుకొని, సోషల్ మీడియాలో పోస్టు లు చేసి…
తెలంగాణలో పార్టీ బలోపేతంపై ప్రత్యేకంగా ఫోకస్ పెడుతోంది కాంగ్రెస్ పార్టీ.. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదులో పార్టీ కార్యకర్తలతో సత్తా చాటి.. పార్టీ అధిష్టానం దృష్టిని ఆకర్షించారు.. ఇక, తెలంగాణ రాజకీయాలపై దృష్టిసారించిన రాహుల్ గాంధీ.. మే నెలలో రాష్ట్రంలో పర్యటించబోతున్నారు. అటు ఢిల్లీలో, ఇటు హైదరాబాద్‌లో వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ.. ఐక్యంగా ముందుకు సాగాలని సూచిస్తున్నారు నేతలు.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఉండాలని చెబుతున్నారు. అయితే, సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పార్టీ…