Revanth Reddy: జయశంకర్ సొంతూరులో రచ్చబండ.. కేసీఆర్‌ను దంచుడే, దించుడే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సొంతూరు అక్కంపేట నిరాధారణకు గురైందన్నారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని ప్రొఫెసర్ జయశంకర్ సొంతూరు అక్కంపేటలో రైతు రచ్చబండ నిర్వహించిన రేవంత్‌రెడ్డి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎక్కడ దోపిడీ ఉంటుందో అక్కడ తిరుగుబాటు ఉంటుందన్నారు.. కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్తే ప్రగతిభవన్ గడి గోడలు బద్దలు కొడతామని హెచ్చరించారు.. జయశంకర్ సార్ సొంతూరు అక్కంపేటలో కనీసం ఆయన విగ్రహం పెట్టలేదని మండిపడ్డ ఆయన.. చివరకు కొండా దంపతులే జయశంకర్ విగ్రహం పెట్టారని గుర్తుచేశారు..
Read Also: Attack: చెరువు కబ్జా..! బీజేపీ నేతలపై గోపన్‌పల్లి వాసుల దాడి
Also Read
ఇక, అక్కంపేటను తాను దత్తత తీసుకుంటానని ప్రకటించారు రేవంత్‌రెడ్డి.. అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీని అక్కంపేటకు తీసుకొస్తానన్న ఆయన.. జయశంకర్ స్ఫూర్తితో రైతు రచ్చబండ కార్యక్రమం ప్రారంభించాను.. 12 నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది వరంగల్ రైతు డిక్లరేషన్ అమలు చేస్తామని స్పష్టం చేశారు. ధరణి పోర్టల్ గంగల కలుపుతా.. కేసీఆర్‌ను బొందలో పెడతా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయని కేసీఆర్‌ను చెప్పులతో కొట్టాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. కేసీఆర్ దంచుడే… కేసీఆర్‌ను అధికారంలో నుంచి దించుడేనంటూ హెచ్చరించారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.
మరోవైపు, కడియం శ్రీహరి, మధుసూదనాచారిలను కేసీఆర్ ఇళ్లలో కూర్చోబెట్టారని విమర్శించారు రేవంత్‌రెడ్డి.. అభివృద్ధి నమూనా ఎక్కడ ఉండాలి అంటే దళిత కాలనీల్లో ఉండాలి.. కానీ, ఎలా ఉంది అని చుస్తే దళిత కాలనీల్లో అభివృద్ధి ఆమడ దూరంలో ఉందన్నారు.. దళిత ఆడబిడ్డల జోలికి వస్తే చెప్పుతో పెట్టి కొట్టండి అని పిలుపునిచ్చారు. అక్కంపేట గ్రామస్థులపైనా కేసీఆర్ కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించిన ఆయన.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. గిట్టుబాటు ధర ఇస్తాం, 2 లక్షలరుణ మాఫీ చేస్తాం అని ప్రటించారు. రాహుల్ గాంధీ ప్రకటించిన రైతు డిక్లరేషన్‌తో రైతులకు లాభం చేకూరుతుందన్నారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా దూరం.. కారణం ఇదే..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!