జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం పార్టీ కాంగ్రెస్‌కు ఫ్రెండ్లీ పార్టీ అని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎంఐఎం తమకు పూర్తి మద్దతు ఇస్తుందన్నారు. జూబ్లీహిల్స్‌లో విజయం తమదే అని పీసీసీ చీఫ్ ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఈరోజు షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 11న ఉప ఎన్నిక పోలింగ్, నవంబర్ 14న ఓట్ల లెక్కింపు జరగనున్నట్లు ఈసీ వెల్లడించింది. మాగంటి గోపీనాథ్ మృతితో జూబ్లీహిల్స్‌లో ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే.
Also Read: Kaleshwaram Lucky Draw: రూ.5001తో కూపన్ కొనండి.. లక్కీ డ్రాలో కోటిన్నర ప్రాపర్టీ పట్టండి!
‘రెండు మూడు రోజుల్లో జూబ్లీహిల్స్ అభ్యర్థి పేరు ఖరారవుతుంది. అభ్యర్థి ఎంపికపై సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడుతున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో పరిస్థితులను బట్టి మిత్రపక్షాలకు టికెట్లు ఇస్తాం. సీపీఎం, సీపీఐ, జనసమితి అభ్యర్థులకు టికెట్లు ఇచ్చే అవకాశం ఉంది. డిసెంబర్ నెలాఖరు వరకు కార్పొరేషన్ పదవులు భర్తీ చేస్తాం. బీసీ రిజర్వేషన్‌పై మేం పడే తపన ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. కామారెడ్డిలో బహిరంగ సభ ఉంటుంది. అక్టోబర్ నెలాఖరులో కామారెడ్డి సభ ఉంటుంది’ అని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చెప్పారు.