తెలంగాణకు అత్యంత కీలకమైన సాగునీటి ప్రాజెక్ట్ ఎస్ఎల్బీసీ (శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కాల్వ) పనులు ఒక్క రోజు కూడా ఆలస్యం కాకూడదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
భారీ వర్షాల కారణంగా కామారెడ్డి జిల్లాలో వరదలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గురువారం కామారెడ్డిలోని జీఆర్ కాలనీని సందర్శించారు.
ఖమ్మం జిల్లా పాల్వంచలో జరిగిన ఆత్మగౌరవ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ చరిత్రలో ఖమ్మం ప్రత్యేకమైన స్థానం ఉందని గుర్తు చేస్తూ 1969లోనే తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది ఖమ్మం అని ఆయన అన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కవిత నిర్వహించిన తాజా ప్రెస్‌మీట్‌పై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. కవిత తన మీడియా సమావేశంలో కొత్తగా చెప్పిన అంశాలేమీ లేవని విమర్శించారు.
తెలంగాణ ప్రభుత్వం మరోసారి భూముల వేలానికి సిద్ధమైంది. శేరిలింగంపల్లి మండలం రాయదుర్గ్‌లోని ప్రభుత్వ భూములను అమ్మేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ రెడీ అయింది. రాయదుర్గ్‌లోని సర్వే నంబర్ 83/1లో ఉన్న 18.67 ఎకరాలను సర్కార్ వేలం వేయనుంది. ఎకరా రూ.101 కోట్లకు విక్రయించనున్నట్లు తెలంగాణ స్టేట్ ఇండస్టీస్ ఇన్ఫ్రాస్టక్చర్ కార్పొరేషన్ (టీఎస్ఐఐసీ) ప్రకటించింది. ఇదే ధరకు అమ్ముడుపోతే.. దాదాపుగా రూ.1900 కోట్లు ప్రభుత్వంకు రానున్నాయి. ఒకవేళ వేలంలో పోటీ ఉంటే.. మరింత ఎక్కువ సొమ్ము సర్కార్ ఖాతాలో…
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి స్మారక అవార్డుల ప్రదానోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వైఎస్సార్‌తో తనకున్న అనుబంధాన్ని, ఆయన పాలన స్ఫూర్తిని గుర్తుచేసుకున్నారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. 2021లో నమోదైన కేసులో వ్యక్తిగత హాజరు నుంచి తెలంగాణ హైకోర్టు మినహాయింపు ఇచ్చింది. కౌంటర్ దాఖలు చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వర్ రావును కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది. సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌లో తనపై నమోదైన కేసును కొట్టేయాలని సీఎం రేవంత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏఐసీసీ పిలుపు మేరకు 2021లో పీసీసీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి రాజ్…
భారీ వర్షాలకు రాష్ట్రంలో జరిగిన నష్టంపై సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. గత ఏడాది వర్షాల కారణంగా జరిగిన నష్టానికి కేంద్రం నుంచి నిధులు రాకపోవడం మీద ఆయన ఆరా తీసుకున్నారు.
ఎన్నికలు, రాజకీయాలు, వివాదాలు ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చని.. తెలుగు వారు అందరూ ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి గెలుపుకు నిలబడాలిని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మాజీ సీఎం వైఎస్ జగన్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే అసదుద్దీన్.. ఆయన గెలుపుకు కృషి చేయాలని వ్యక్తిగతంగా కోరుతున్నానన్నారు. సుదర్శన్ రెడ్డి గెలుపు వల్ల మన తెలుగువారి ప్రతిష్ఠ మరింత పెరుగుతుందని సీఎం…