ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేడు హైదరాబాద్లో పర్యటించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఉదయం 11.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. తెలంగాణలో రూ.11,300 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.
కాంగ్రెస్-బీఆర్ఎస్ల మధ్య పొత్తుపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ అధ్యక్షుడిగా ఉన్నంత కాలం కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. మీడియాతో చిట్చాట్లో ఈ మేరకు వ్యాఖ్యానించారు. సహజ మిత్రుడు, పార్ట్నర్ అంటూ అసదుద్దీన్ గురించి రేవంత్ మాట్లాడారు.
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పైడిపెల్లి గ్రామంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటించారు. ఈ క్రమంలో విపక్ష నేతలతో విరుచుకుపడ్డారు. బండి సంజయ్ పిచ్చోడని.. పిచ్చిపిచ్చిగా మాట్లాడుతాడని.. రేవంత్ రెడ్డికి మెదడు లేదని ఆయన విమర్శించారు.
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడాన్ని తప్పుబడుతూ కాంగ్రెస్ పార్టీ పోస్టుకార్డు ఉద్యమాన్ని నిర్వహించనుంది. ఇవాళ గాంధీ భవన్ లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్ రావ్ థాక్రే ఈ ఉద్యమాన్ని ప్రారంభించనున్నారు.