తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈసారి కాంగ్రెస్ పార్టీ వర్సెస్ కమలం పార్టీగా మారాయి. బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు సవాల్ విసురుకుంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీద ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్య లు తీవ్ర దుమారం రేపుతున్నా యి.
Komati Reddy : తాను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ నియోజకవర్గం నుంచే పోటీచేస్తానని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. తాను బరిలోకి దిగితే ప్రజలు తనను కచ్చితంగా గెలిపిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఏ శాఖలో ఎన్నిఖాళీలున్నాయో 24గంటల్లోగా చెప్పు బండి సంజయ్ అంటూ టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. మోడీ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారని మండిపడ్డారు. 22 కోట్ల 6 లక్షల అప్లికేషన్ లు ఉద్యోగం కోసం దరఖాస్తు చేసినట్టు మోడీ చెప్పారని తెలిపారు.
తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత పోరు నడుస్తోంది. కాంగ్రెస్ లో గ్రూపుల తగాదాలు మళ్లీ బయట పడ్డాయి. హైకమాండ్ ఎన్నిసార్లు చెప్పినా.. రాష్ట్ర ఇన్ ఛార్జి మారినా.. ఇక్కడి నేతల తీరు మారడం లేదు. పార్టీలో వర్గ విభేదాలు మాత్రం బయటపడుతూనే ఉన్నాయి.