Off The Record: మళ్లీ కోవర్టుల ప్రస్తావన.. కోవర్టులు లేరా ? గాంధీ భవన్ పునీతమైందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: టి కాంగ్రెస్‌లో కోవర్టుల వ్యవహారం మళ్లీ తెర మీదకు వచ్చింది. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న రెండో రోజే.. ఈ విషయంలో సీరియస్‌గా స్పందించారు. పార్టీలో ఉన్న కోవర్టులు వెంటనే బయటికి వెళ్లిపోవాలని వార్నింగ్ ఇచ్చారాయన. అప్పట్లో ఆ కామెంట్స్ పెద్ద ఎత్తున దుమారం రేపాయి. వాళ్ళెవరో తేల్చమని జగ్గారెడ్డి లాంటి నాయకులు డిమాండ్ చేశారు. సొంత పార్టీ నేతలను డ్యామేజ్ చేస్తావా అంటూ మరికొందరు చిర్రు బుర్రులాడారు. ఆ తర్వాత వ్యవహారం సద్దుమణిగింది. తాజాగా గాంధీభవన్ మీటింగ్‌లో కోవర్టుల అంశాన్ని మళ్లీ ప్రస్తావించారు రేవంత్. అయితే ఈసారి మాత్రం పార్టీలో అలాంటి వాళ్ళు ఎవరూ లేరని ప్రకటన చేశారు . అంటే.. దీని అర్థం ఏంటి? అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో జరుగుతోంది. తాను పీసీసీ ప్రెసిడెంట్ అయ్యాక కోవర్ట్‌లంతా పార్టీ నుంచి వెళ్ళిపోయారనా? లేక వెళ్ళిన వాళ్ళలో అలాంటి వారు ఉన్నారనా? అన్న డౌట్స్ పెరుగుతున్నాయి..
సాధారణంగా రేవంత్‌రెడ్డి తాను చేసిన ఆరోపణలపై మెట్టు దిగరు. కానీ ఇటీవల ఆయన దిగే పనిలోనే ఉన్నారు. కోవర్టుల విషయంలో కూడా అలాగే ఒక మెట్టు దిగినట్టు చెబుతున్నారు. తన కామెంట్స్‌ని పార్టీలో కొంతమంది నాయకులు ఉద్దేశ్యపూర్వకంగానే వివాదం చేస్తున్నారన్నది రేవంత్ అభిప్రాయం అట. ఎన్నికలు కూడా దగ్గర పడుతున్నందున నాయకులు అందర్నీ కలుపుకొని పోవాలన్న ఆలోచనలో భాగమే తాజా ప్రకటన అని చెబుతున్నారు. మరోవైపు తెలంగాణలో పార్టీని ప్రియాంక గాంధీనే నేరుగా పర్యవేక్షించబోతున్నారు. దీంతో ఇష్టం ఉన్నా… లేకున్నా…అందర్నీ కలుపుకుని పోవాల్సిన బాధ్యత పీసీసీ అధ్యక్షుడి మీద ఉంటుంది. అందుకే ఆయనలో మార్పు వచ్చిందన్న మరో వాదన కూడా ఉంది. అయితే ఇప్పుడు మిగతా నాయకులు కలిసి వస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది. కలవని వారిని సైతం బుజ్జగించుకుని వెంటబెట్టుకోవాల్సిన బాధ్యత నాయకత్వం మీదే ఉంటుందన్నది మెజార్టీ నేతల అభిప్రాయం.
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మధ్య సమన్వయ లోపం అనేది తెరమీదకు వచ్చింది. పార్టీలో నాయకులంతా కలిసి పని చేస్తే గెలుపు పెద్ద సమస్య కాదు అనేది కర్ణాటకలో తేలిపోయింది. నాయకులు మధ్య అభిప్రాయ భేదాలు ఎలా ఉన్నా పార్టీని గెలిపించే విషయంలో అందరూ ఏకం కావాలి అన్నది మౌలికమైన అంశం. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ నాయకులంతా ఐక్యతా రాగమే ఆలపిస్తున్నారు. ఇలాంటి సమయంలో పీసీసీ చీఫ్ తన పాత శైలిలోనే ఉంటే ఇబ్బందులు తప్పవు. అందుకే ఆయన పంతం వీడి దిగివస్తున్నట్టు చెప్పుకుంటున్నాయి గాంధీభవన్ వర్గాలు. దీనికి తోడు పార్టీలో ఒకరిద్దరు సీనియర్ నేతలు రేవంత్ మాటల్ని, వాటితో వచ్చే సమస్యలను అధిష్టానం దగ్గర భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారనేది ఆయన సన్నిహితుల అంచనా. అలాంటి వారికి అవకాశం ఇవ్వడం ఎందుకన్న ఆలోచనతోనే పీసీసీ ప్రెసిడెంట్ వైఖరి మార్చుకున్నారట. మొత్తంగా కర్ణాటక ఫలితాల తర్వాత తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త వాతావరణం కనిపిస్తోంది.
తాజావార్తలు
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
-
Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!