టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అధికారంలో ఉన్నదే ఆ పార్టీ అని, మరి అప్పట్లోనే పాలమూరును అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి వుంటే తెలంగాణ ఎందుకు అవసరం ఉండేదని ఆయన ప్రశ్నించారు. వలసలకు.. 14 రోజులకు ఓ సారి తాగునీరు.. తాగునీటి ఎడ్డదికి మీ పార్టీ కారణమన్నారు. అంతేకాకుండా.. ‘సీఎంగా కేసిఆర్ వచ్చకనే రోజూ తాగునీరు.. 24 గంటల కరెంటు వస్తుంది. రైతులకు పెట్టుబడి.. ఏ రాష్ట్రం ఇస్తుంది. అప్పుడు 30 హాస్టల్స్ ఉంటే.. ఇపుడు 140 రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయి. ప్రతీ స్కూల్ ను ఇంటర్.. డిగ్రీ కళాశాలుగా అప్ గ్రేడ్ చేస్తానని సీఎం కేసీఆర్ అన్నారు. మీరు నెలకు పది లక్షలు పెంచన్ ఇస్తుండే.. మేము నూట ఆరు కోట్లు ఇస్తున్నాం. పేదల పెళ్ళిళ్ళకి మీరు ఇచ్చింది శూన్యం.. మేము లక్ష రూపాయలు అందిస్తున్నమ్. మీరు భూమి పూజ చేసి వదిలేసిన ప్రాజెక్టులను మేము రన్నింగ్ ప్రాజెక్ట్ గా చేసినం.
Also Read : RK Roja: దిగజారుడు మాటలు మాట్లాడిన టీడీపీని.. సెంటు భూమిలో పాతిపెట్టాలి
ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. అట్లా వలసలు వాపస్ వచ్చేలా.. పరిశ్రమలు కూడా తెస్తున్నాం. ఆత్మ గౌరవ భవనాలు నిర్మాణం.. పాలమూరులో చిన్న పార్క్ కూడా లేని దుస్థితి. బడుగు బలహీనర్గాలకు చెందిన వారిని రాజకీయంగా సామాజికంగా ఎదుగుదలకు ప్రోత్సాహం. అసలు నక్సలైట్లు గా మారేందుకు మీరే కారణం.. అట్లే వారిని ఎన్ కౌంటర్ లలో చంపిన వారూ మీరే.. పేద వర్గాల కులాలను అగౌరవ పరిచేలా మాట్లాడి వారిని అవమాన పరిచారు. ఏం పాపం చేశినరని వారిని కులం పేరుతో దుషిస్తున్నరు. మీకు చిన్న కులాల పట్ల ఎందుకు అంత కసి. వీళ్ళ ఓట్లు అవసరం లేదని అను.. ఓ సారి.. ఓట్లప్పుడు వీళ్ళు కావాలే.. తర్వాత అవమాన పారచాలి.. ఇదేనా మీ వైఖరి. మాకు సభ్యతా సంస్కారాలు నేర్పారు కనుక మేమ్ మాట్లాడలేమ్. సురవరం ప్రతాపరెడ్డి పుట్టిన నేల ఇది.. మనం హుందాగా ఉండాలి. ఆనాడు సోనియా గాంధీనీ దయ్యమ్ అన్నవ్.. ఇయ్యాల్ల దేవత అంటున్నావు.. రేపు ఏమంటావో తెలియదు. మేము మా జిల్లాను ఏలాంటి మత కల్లోహాలు లేకుండా ఆత్మ గౌరవం తో బతికే విదంగా చేసేందుకు కృషి చేస్తాం. ఇప్పటికే ఎంతో అభివృద్ధి జరిగింది.. ఇంకా చేస్తాం..
అది మీకు కనిపించకుంటే.. మీ ఖర్మ.’ అని వ్యాఖ్యానించారు.
Also Read : CPM Protest : ఎస్‌ఐ అత్యుత్సాహం.. సీపీఎం నేతలపై చేయి చేసుకున్న వైనం