బీఆర్ఎస్ పై ప్రతిపక్షాలు పోరాడేందుకు సిద్ధమవుతున్నాయి. బీజేపీ, తెలంగాణ కాంగ్రెస్, వైఎస్ఆర్ పార్టీలు మూడుకూడా ముకుమ్ముడి బీఆర్ఎస్ పై దాడి చేసేందుకు ప్లాన్ సిద్దం చేసుకుంటున్నారు.
వంద కోట్ల ఇస్తే.. కేటీఆర్ ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చా ? అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. TSPSC పేపర్ లీకేజీ పై ఈడీ కి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఇతర నేతలు పిర్యాదు చేశారు.
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆత్మీయ ఆహ్వానం ప్రస్తుతం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ‘నా ఇంటికి రా.. ఇది నీ ఇల్లు భయ్యా’ అంటూ రాహుల్ గాంధీని ఢిల్లీలోని తన ఇంటికి ఆహ్వానించారు రేవంత్ రెడ్డి. ‘నా ఇల్లు మీ ఇల్లు... మిమ్మల్ని నా ఇంటికి ఆహ్వానిస్తున్నాను.. మనది ఒకే కుటుంబం.. ఇది మీ ఇల్లు’ అంటూ సోషల్ మీడియా వేదికగా రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి సందేశం పంపారు.